మరో వైపు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల కొంతమంది కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు. ముఖ్యంగా బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకొచ్చారు. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించగా, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ల స్థానాలు దక్కించుకుని తన ఉనికిని చాటింది. దీంతో తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా మారిపోయింది.
బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన కామెంట్లపై ధర్నాలు చేస్తుంది. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ అన్నారని కాంగ్రెస్ వస్తే రైతులకు కరెంట్ ఉండదని ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా 24గంటల కరెంట్ పేరుతో రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇలా రోజుకో విధంగా తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. ఒకరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతుంటే మరో రోజు బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యర్థి అనే విధంగా, ఇంకో రోజు కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతుంది.
బీజేపీకి పోటీ చేసేందుకు పేరున్న లీడర్లు లేరని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి. కానీ గెలిచిన తర్వాత ఎలాగో పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. బీఆర్ఎస్ నుంచి కూడా గతంలో పేరు లేని లీడర్లు ఉండేవారు. కేవలం కేసీఆర్ వల్లే గెలిచిన వారు ఉన్నారు. మొత్తం మీద తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి