జాతీయ సినిమా అవార్డులు ప్రకటించిన తర్వాత జైభీమ్, పుష్ప అనే సినిమాల గురించి వివాదం రాజుకుంది. సోషల్ మీడియాలో జైభీమ్ సినిమాకు అనుకూలంగా.. పుష్పకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే జైభీమ్ మంచి సినిమానే దాన్ని కాదని ఎవరూ అనలేరు. పుష్ప ఒక దళిత అబ్బాయి ఎర్రచందనం స్లగ్మర్ గా మారి ఎలా చేస్తారనేది థీమ్. అయితే సినిమా అవార్డులను కేవలం నటనకు మాత్రమే ఇస్తారు. అందులో థీమ్ గురించి ఆలోచించి ఇవ్వాలంటే చాలా వరకు నడవని సినిమాలు ఉంటాయి. వాటికి కూడా అవార్డులు ఇవ్వాల్సి ఉంటుంది.


స్టోరీ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో కూడా కొంతమంది నటీనటులకు అవార్డులు రాకపోవచ్చు. అంత మాత్రాన వారికి నటన రాదని కాదు. అయితే జై  భీమ్ సినిమాలో దళిత వ్యక్తిని అకారణంగా కొట్టి పోలీసులు చంపేస్తే దానిపై అతని భార్య చేసే పోరాటం.. దాని వెనక ఓ అడ్వొకేట్ చేసే పోరాటం దళిత జాతికి న్యాయం చేసే ప్రయత్నంపై అద్భుతంగా ఉంటుంది. నిజ జీవితంలో దళిత వ్యక్తి చనిపోతే అతడి తరఫున పోరాడిన వ్యక్తి బ్రాహ్మణుడు కృష్ణస్వామి చంద్రు, అయితే ఈ కేసులో పోలీసు అధికారి క్రిస్టియన్ ఆంటోని. అయితే జైభీమ్ లో సూర్య నటన కూడా అద్భుతంగా ఉంటుంది.


డబ్బు, మదం, అధికార పొగరు కూడా అన్నింటినీ అణిచివేయగల శక్తి, న్యాయం సాధించే సాహాసం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి ఉందని సినిమా నిరూపిస్తుంది. అయితే గతేడాదే సూర్యకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం.. వెంటనే మళ్లీ ఈ సినిమాకు కూడా ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వాలేదేమోననే వాదన కూడా బయటకొచ్చింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా జాతీయ ఉత్తమ అవార్డు తెలుగు వ్యక్తికి రావడం ఇక్కడ ఆనందించాల్సిన విషయం. అవార్డులు వచ్చిన తర్వాత కూడా దాన్ని కావాలనే కొంతమంది వివాదం చేయాలని చూస్తున్నారని కూడా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: