ఈ కాలంలో జరిగే ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకోకుండా పోలింగ్ బూత్ కి ఎవరు వెళ్లడం లేదు. నిజం చెప్పాలంటే అది వారి తప్పు కూడా కాదు.  ప్రజలకు డబ్బును అలవాటు చేయడం అనేది రాజకీయ నాయకుల తప్పేనని కొంతమంది సామాజిక విశ్లేషకుల భావన. ప్రకటించి మహిళా ఓటర్లు పోలింగ్ బూత్ కి రావాలంటే వాళ్లకు కచ్చితంగా డబ్బు ముట్ట చెప్పాల్సిందే అని అంటారు.


అది కూడా ఎలక్షన్లు దగ్గర పడ్డాక ఇవ్వడం కాదు. ఇంచుమించు నెల నెల  ఇస్తూ వెళ్లాలి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 45ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆయన అలా అన్నప్పుడు ప్రజలకు ఈ రకంగా డబ్బులు అలవాటు చేయడం మంచిది కాదని చాలామంది జగన్ ఆలోచనను తప్పుపట్టారు. దాంతో నెలకి 1500 ఇస్తానన్న అదే సొమ్మును 12 నెలలకు కలిపి ఒక్కసారి 18000 చొప్పున ఇస్తానని జగన్ చెప్పడం జరిగింది. అదే చేయూత పథకం.


అయితే మొన్నటి వరకు జగన్ ఆలోచనను కామెంట్ చేసిన వాళ్ళు  ఇప్పుడు తాము కూడా ఇదే రకంగా  సంక్షేమాలను ప్రకటించడం విచిత్రం. అయితే ఆంధ్రాలో 1500  ఇస్తాను అంటే, కర్ణాటకకి వచ్చేసరికి 2000 ఇస్తానని  ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. ఇదే సందర్భంలో తమిళనాడులో ఉదయనిది స్టాలిన్ కళాంగర్ ఉరిమై మలగిర్ తిట్టం పేరుతో మహిళలకు నెలనెలా 1000 రూపాయలు చొప్పున ఇస్తానని ప్రకటించడం జరిగింది.


అయితే ఇది సహాయ నిధి కాదని, హక్కు నిధి అని ఆయన ప్రకటించడం జరిగింది. తమిళనాడులో ఈ విధంగా ఈరోజు నుండి ప్రతినెల  కోటి మంది మహిళలకు 1000 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పడం జరిగింది.  కోటి మంది మహిళలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అంటే మొత్తంగా 1000 కోట్ల రూపాయలు వరకు ప్రతినెల ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఓట్ల కోసం మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి అన్ని పార్టీలు. అయితే మోదీ తాజా మహిళాబిల్లు తెచ్చిన నేపథ్యంలో తమిళ మహిళ ఓటు స్టాలిన్‌కా.. మోదీకా అన్న చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: