
మన వాళ్ళు ఆ ఉగ్రవాది దగ్గరకు వెళ్లకుండా మనవాళ్లపై కాల్పులు జరిపిస్తుంది పాకిస్తాన్. గతంలో అయితే వెనక్కి వచ్చి ఢిల్లీలో ఉన్న కేంద్రాన్ని అడిగి పర్మిషన్ తీసుకొని కాల్పులు జరపవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో మన సైన్యం పులిలాగా చెలరేగి ఎదురు వచ్చిన పాకిస్తాన్ సైన్యాన్ని ఎదురొచ్చినట్లుగా చంపి పడేస్తున్నారు. తీవ్రవాదులను ఏరిపారేయడం మొదలుపెట్టారు.
ఆఖరికి కాశ్మీర్లో ఉన్న లష్కరే తోయిబా హెడ్ ను కూడా చంపేశారు. ఇలా ఏడుగురు తీవ్రవాదులను భారత సైన్యం చంపింది. ఎవరిని వదిలి పెట్టే ఆలోచన లేదు భారత్ సైన్యానికి. ఇదంతా చూస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదంతా భారత్ కావాలనే చేస్తుంది మేము కవర్ ఫైర్లు ఏమి చేయడంలేదు. ఇదంతా భారతదేశం కావాలని మా మీద అవాస్తవాలను రుద్దడానికి ప్రయత్నిస్తుంది అని వాబోతుంది.
అయితే వాళ్ళ సైన్యం అనుమతి లేకుండానే ఒక తీవ్రవాది పాకిస్తాన్ దాటి భారత వరకు చేరుకోవడం అనేది సాధ్యం కాదు. సాధ్యమైంది అంటే ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్న పని. అయితే అంత సరదాగా భారత్ లోకి తీవ్రవాదులను పాకిస్తాన్ వదులుతుందంటే భారత్ అంటే సరైన భయం ఇంకా కలగలేదని అర్థం. కానీ భారత్ మాత్రం ఒక్క తీవ్రవాది వచ్చినా కూడా వదలాలని అనుకోవడం లేదు. వాళ్ల కర్మ కాలి ఇటు వచ్చారంటే మాత్రం అదే వాళ్లకు చివరి రోజు.