చీమలు పెట్టిన పుట్టలను పాములు వాడుకుంటాయి. వాటి శ్రమను అవి పాముల కోసం ధారపోస్తాయి. అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను ఒక స్థాయికి తీసుకెళ్లిన తర్వాత వాటిని ఇతర కంపెనీలు కొనుగోలు చేసి సంస్థ అభివృద్ధి కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టేస్తుంటారు. ఉదా ట్విటర్ చూసుకంటే ఇదే విషయం పునరావృతమైంది. అందులో కీలకంగా పనిచేసే ఉద్యోగిని మస్క్ కొనుగోలు చేసిన తర్వాత పక్కన పెట్టేశారు.  అలాంటి పరిణామమే చాట్ జీ పీటీలో చోటు చేసుకుంది.  ఉద్యోగులందరూ ఎదురు తిరగడంతో చాట్ జీపీటీ కి సంబంధించిన వ్యక్తిని తిరిగి తీసుకున్నారు.


పవర్ ఫుల్ ఏఐ టూల్ చాట్ జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్ మన్ ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒపెన్ ఏఐ సీఈవో పదవి నుంచి సామ్ తొలగింపుపై టెకీ ప్రపంచంలో ప్రకంపనలు కొనసాగాయి. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆల్ట్ మన్ కు అండగా నిలిచారు. అందరూ మూకుమ్మడిగా రాజీనామ చేస్తామని బోర్డును బెదిరించారు.


ఈ మేరకు ఓపెన్ఏఐకి 700మంది ఉద్యోగులు హెచ్చరికల లేఖలను పంపారు. ఆల్ట్ మన్ ను తీసుకోకుంటు తామంతా వైదొలిగి మైక్రో సాఫ్ట్ లో చేరుతామని హెచ్చరించారు కూడా. సీఈఓ తొలగింపుతో కంపెనీలోని దాదాపు 95శాతం ఉద్యోగులు నిష్క్రమిస్తానని చెప్పడం చాలా అరుదనే చెప్పాలి.  ఈ క్రమంలో ఉద్వాసనకు గురైన ఆల్ట్ మన్ మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. మైక్రో సాఫ్ట్ తో కలిసి పనిచేసుందుకు సుముఖుత వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సంచలనంగా మారిన ఆల్ట్ మన్ తొలగింపు కథ సుఖాంతమైంది.


ఉద్యోగుల బెదింరిపులకు వెనక్కితగ్గిన బోర్డు తిరిగి ఆయన్ను ఓపెన్ ఏఐ సీఈఓగా నియమిస్తున్నట్లు తెలిపింది. అలాగే బోర్డులో కొత్త సభ్యుల నియామకంపై కూడా సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. దీంతో తప్పని పరిస్థితుల్లో బోర్డు డెరెక్టర్లు రాజీనామా చేశారు. తొలగించిన వ్యక్తి కోసం మూకుమ్మడి రాజీనామాలు.. తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవడం సాఫ్ట్ వేర్ చరిత్రలో అరుదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: