అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార బీఆర్ఎస్ ను ఓడించి ప్రతిపక్ష కాంగ్రెస్ కు పట్టం కట్టారు. హ్యాట్రిక్ విజయం సాధించి రాజకీయ చరిత్రను తిరగ రాస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ప్రకటించారు. కానీ ఓటర్ల తీర్పు ఇందుకు విరుద్ధంగా వచ్చింది. కాంగ్రెస్ ను అధికారంలోకి కూర్చోబెట్టారు. ఫలితాలు వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.


వాస్తవానికి బీఆర్ఎస్ పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. పట్టణ ఓటర్లందరూ గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపారు. రంగారెడ్డి, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆ పార్టీ పట్టు నిలుపుకుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాటునే ఓడిన తర్వాత కూడా కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ కు తెలంగాణలో ఫామ్ హౌస్ సీఎంగా ముద్ర పడింది. అధికారంలో ఉన్నన్ననాళ్లు సచివాలయానికి రాలేదు. కొత్త సచివాలయం నిర్మించినా ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చారు. అయితే ఓడిన తర్వాత సమీక్ష నిర్వహించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన కేసీఆర్ తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశం అయింది.


ఓడిన తర్వాత గతంలో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఎందో హుందాగా తమ ఓటమిని అంగీకరించామని చెప్పారు. మరోవైపు కిషన్ రెడ్డి సైతం ఓటమిని ఒప్పుకొని కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు.  అయితే కేసీఆర్ మాత్రం ప్రతిపక్ష పాత్ర అప్పజెప్పిన ప్రజలకు కనీసం సమాధానం చెప్పలేదు.  తన రాజీనామా లేఖను సైతం ఓఎస్టీ ద్వారా పంపిచారు.


మరోవైపు కేటీఆర్ స్పందించి ఓటమిపై మాట్లాడారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలతో సమీక్షలు జరిపారు. అంతేకానీ కేసీఆర్ ఎక్కడా బయట కనిపించలేదు. దీనిపై మాట్లాడలేదు. ఇప్పటికైనా కేసీఆర్ హుందాగా ప్రజల ముందుకు వచ్చి తన ఓటమిని అంగీకరించి తన గౌరవాన్ని నిలుపుకోవాలని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: