పవన్ కళ్యాణ్  ఇటు సినిమాల్లోనూ, అలాగే అటు రాజకీయాల్లోనూ ఒకేసారి ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయనకి సంబంధించి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో అభిమానులకు, అలాగే ప్రజలకు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. కానీ రాజకీయాల విషయంలోకి వచ్చేసరికి ఆయన రాబోయే  ఎన్నికలకు ఎవరితో కలిసి పోటీ చేయబోతున్నారనే విషయంలో అయితే ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి.


ఈ సందేహాలకు కారణం కూడా పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న పద్ధతే అనేది స్పష్టం. ఎందుకంటే ఆయన ముందు నుండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని గెలిపించండి అని కోరుకుంటున్నారు. అంటే ఆయన రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళబోతున్నారన్నట్లుగా స్పష్టమవుతుంది. అలాగే ఆయన ఎన్ డి ఏలో కూడా భాగస్వామిగా ఉన్నారన్న విషయం కూడా తెలిసిందే.


అంటే ఆయన రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి ముందుకు సాగుతానని తన చర్యల ద్వారా  స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అర్థం అవ్వని విషయం ఒకటి ఉంది. అదేంటంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని ఆలోచన లేదు.  అలాంటప్పుడు పవన్ కళ్యాణ్  ఒకవైపు భారతీయ జనతా పార్టీతో ఉంటూ మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎలా చెప్తారు అని అడుగుతున్నారు కొంతమంది.


అంటే ఆయన  ఎన్నికలు జరిగే సమయం లోగా భారతీయ జనతా పార్టీ కి తెలుగుదేశం పార్టీతో   సఖ్యత కుదురుస్తారా? అది ప్రాక్టికల్ గా జరిగే పనేనా అని అడుగుతున్నారు కొంతమంది. అసలు ఆయన రాజకీయ వ్యూహం ఏమిటి అనేది చాలా మందికి ఇప్పుడు ఒక బేతాళ ప్రశ్నలా మారింది. అయితే ఆయన వ్యూహాల గురించి  ప్రజలకు ఒక అవగాహన మిస్సయిందని ఆయనకు తెలిస్తే ఇప్పటికైనా స్పష్టంగా రాజకీయ అడుగులు వేయాలని కోరుకుంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు.  మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్  వారికి ఏ స్పష్టత ఇస్తారనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: