
మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైంది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారన్న సజ్జల.... నిజాలు విచారణలో తేలుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ మాట్లాడుతున్నారన్న సజ్జల.. ఎవరికి అధికారం ఇవ్వాలన్నది జనమే నిర్ణయం తీసుకుంటారన్నారు. అది తేల్చేది పవన్ కళ్యాణ్ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంటన్న సజ్జల.....చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 పథకాలను రద్దు చేశారన్న ఎస్సీ ఎస్టీ సంఘం ఆరోపనలను సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలే మేజర్ లబ్దిదారులు ఉన్నారని, టీడీపీ హయాంలో ట్రైబల్ కమిటీ కూడా వేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్న పథకాలు రద్దు చేసి ఉండొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటేనే జగన్ సీఎం కాకుండా ఆపడం సాధ్యం అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అపరిపక్వత, మూర్ఖత్వం,అజ్ఞానంతో తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్న ఆయన.. చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బాపట్లలో ఆర్టీసీ స్థలంలో వైసీపీ కార్యాలయం శంకుస్థాపనపైనా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైసీపీ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారని అన్నారు.