రాబోయే ఎలక్షన్స్ లో 175 సీట్లకు 175 గెలుస్తాం అని వై.ఎస్.ఆర్.సీ.పీ అంటుంటే, తెలుగు దేశం మాత్రం తాము 175 కి 160 సీట్లు గెలుస్తామని చెప్తుంది. ఆ లెక్క ప్రకారం జనసేనకు 15 సీట్లే వస్తాయా అనేది ఇక్కడ తేలాల్సి ఉంది. ఎందుకంటే తెలుగు దేశం, జనసేన కలిసి 160 సాధిస్తామని చెప్పడం లేదు. కేవలం తెలుగు దేశం మాత్రమే 160 సాధిస్తామని చెపుతున్నారు. అయితే ఒక ప్రక్కన  వై.ఎస్.ఆర్.సీ.పీ, జనసేన తెలుగు దేశం తోనే ఉందంటుంటే,  మరొక ప్రక్క తెలుగు దేశం కూడా జనసేన తమతోనే ఉందని చెప్తుంది.


వీరి ప్రచారాల హడావుడి దెబ్బకి జనసేన లోకి వచ్చే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తల నుంచి వస్తున్న ప్రతిఘటన తో కూడిన కధనం ఇలా ఉంది. తెలుగు దేశం ఒంటరిగా గెలవాలంటే 92 శాతం సీట్లు రావాలి. ఇలా రావాలంటే 50 శాతం పైగా ఓట్లు రావాలి. మొత్తం పడిన ఓట్లలో మొన్న 40 శాతం ఓట్లు వస్తే గెలిచిన స్థానాలు 23 మాత్రమే. జనసేన లేకుండానే ప్రభుత్వాధికారం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు పచ్చ మీడియా, నీలి మీడియా  జనసేన పార్టీని ఎందుకు అల్లరి చేస్తున్నారు అని  జనం అనుకుంటున్నారు. పచ్చ మీడియా జనసేన తెలుగు దేశానికి కావాలని చెప్తుంటే, నీలి మీడియా  తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తారంటుంది.


పచ్చ పార్టీ ఏం చేసిందో ప్రజలు చూశారు, అలాగే నీలి పార్టీ ఏం చేస్తుందో కూడా చూస్తున్నారు. ప్రజలకు వీళ్ళిద్దరి కన్నా పవన్ కళ్యాణ్ బెస్ట్ అనే స్పష్టత వచ్చిందంటున్నారు జనసైనికులు. 175 కి 175, ఇంకా 175కి 160 అని వాళ్ళిద్దరూ చేస్తున్న ప్రచారం అంతా మేకపోతు గాంభీర్యమే. జనసేనకు ఇప్పుడున్న లో ప్రొఫైల్ తుఫానుకు ముందు ఉన్న ప్రశాంతత లాంటిది.ఇక ఆ తుఫాన్ దెబ్బకు ఎవరు కొట్టుకుపోతారో అని జనసేన గురించి సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: