
తెలంగాణలో ఎక్కువ కాలం పాటు గవర్నర్ నరసింహన్ వ్యవహరించారు. అంతవరకు బాగానే ఉన్నా తర్వాత వచ్చిన తమిళిసై తో సీఎం కేసీఆర్ కు పడటం లేదు. బిశ్వభూషణ్ గవర్నర్ గా ఏపీలో ఉన్నప్పుడు ఏపీ సీఎం జగన్ కు ఆయనకు మధ్య అనుబంధం సరిగానే ఉండేది. మరి ప్రస్తుతం ఏపీ గవర్నర్ ను మార్చారు. ఏపీకి నూతన గవర్నర్ గా అబ్దుల్ నజీర్ వచ్చారు. దీనికి సంకేతం మోడీకి జగన్ కు మధ్య విబేధాలు వచ్చాయా? లేకపోతే ఏపీకి ఏమైనా సమస్యలు రాబోతున్నాయా?
ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా వచ్చిన అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గతంలో అయోధ్య వివాదంలో తీర్పు ఇచ్చిన 5 గురు న్యాయమూర్తుల్లో ఈయన ఒకరు. ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ ను ఎంపిక చేశారు. మూడు రాష్ట్రాల రాజధానుల బిల్లులకు బిశ్వ భూషణ్ ఈజీగా సైన్ చేసేశారు. ఏ బిల్లులైనా ఆ శాఖ తయారు చేశాక లీగల్ డిపార్ట్ మెంట్ కు పంపిస్తారు. తప్పులు లేవనుకుంటే అడ్వకేట్ జనరల్ సూచనలు తీసుకోవాలి. కానీ ఏపీలో ఆయనను అసలు పట్టించుకోరు. నూతన గవర్నర్ తో ఏపీకి ఏమైనా తలనొప్పులు వస్తాయో చూడాలి.