తెలంగాణను పేపర్‌ లీకేజీ జాడ్యం పట్టి పీడుస్తోంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశం దుమారం రేపుతుంటే ఇప్పుడు పదో తరగతి పరీక్షల్లో కూడా లీకేజీలు వెలుగు చూస్తున్నాయి. నిన్న వికారాబాద్‌లో పరీక్ష మొదలైన అరగంటకే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లికేజీ కావడం అత్యంత దురదృష్టకరమని... కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని.. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్ విమర్శించారు.


పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్.. ప్రభుత్వ చేతగానితనం  విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందని... కొన్ని కార్పొరేట్,  ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని... ఈ లికేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.


టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్.. పేపర్ లికేజ్ కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్.. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో  ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే  ఒత్తిడి కన్పిస్తొందని.. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్ అన్నారు.


మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులంతా  టెన్షన్ కు గురికాకుండా దైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: