నాలుగు రోజుల క్రితం అనుహ్యంగా ఢిల్లీలో పవన్ ప్రత్యక్షమయ్యారు. ఏ విధంగానైనా ఏపీలో అధికారంలోకి రావాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం తో భవిష్యత్తు కార్యాచరణ, జగన్ ను ప్రశ్నించే విధంగా చేయాలని, ఆయనపై కేసులు పెట్టాలని, ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే జగన్ పై వ్యతిరేకత పెరుగుతుందనే ఆలోచనతో వెళ్లినట్లు కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. సంక్షేమ నిధులు ఆపేస్తేనే ప్రజలు జగన్ పై తిరగబడే అవకాశం ఉంటుందని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.


ఎప్ ఆర్ బీఎం నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్న విషయాన్ని పైన చెప్పేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్ఆర్ బీఎం నిబంధనల్లో రెండు విషయాల్లో సడలించి ఇచ్చారు. ఒకటి స్మార్ట్ మీటర్లు పెడితే 0.5 అప్పు తీసుకోవడానికి అనుమతిచ్చారు. చెత్త పన్ను కరెక్టుగా వసూలు చేేస్తే అదనంగా అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు.


దీనితో నే అదనంగా రూ.8వేల కోట్లు వచ్చాయి. కానీ ఎప్ఆర్ బీఎం నిబంధనలకు వ్యతిరేకంగా అప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పవన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోఢీ అయితే బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని గతంలోనే సూచించారు. కానీ పవన్ టీడీపీతో కలిసి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  


అయితే అమిత్ షా తో మీటింగ్ తర్వాత పవన్ కల్యాణ్ ఎలాంటి రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళతారోనని రాజకీయ మేధావులు ఆలోచిస్తున్నారు. ఈ సారి మాత్రం జగన్ ను ఎలాగైనా ఓడించాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు. దీని కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. మరి పవన్ కు బీజేపీ మద్దతిస్తే టీడీపీ తో  పవన్ కలుస్తాడా.. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ కలుస్తుందా. బీజేపీ, టీడీపీ మధ్య గత ఎన్నికల సందర్భంగానే తీవ్ర విబేధాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: