రాజకీయ నాయకులు ఎన్నికల సంఘానికి ఆఫిడవిట్ లో తమ ఆస్తులు, అప్పులు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని ఎన్నికల సంఘం డిస్ క్లోస్ చేస్తుంటుంది. వాటి ఆధారంగా మాజీ ఐఎఎస్ లు కొన్ని రిపోర్టులు ఇస్తుంటారు. తాజాగా ఎడీఆర్ రిపోర్టుల ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్పుల్లో ఉన్నారట. వ్యక్తిగతంగా  ఆయన కు అప్పులు ఉన్నాయని తెలుస్తోంది.


విచిత్రమేమిటంటే సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లో పండించే క్యాప్సికం పంటకు కొన్ని లక్షల రూపాయలు వస్తాయని చెప్పారు. దీని వల్ల రైతుగా ఎంతో లాభం పొందుతున్నానని ప్రకటించారు. ఈ మధ్య దేశ వ్యాప్తంగా ఎన్నికలయ్యే ఖర్చును భరిస్తాను. బీజేపీ వ్యతిరేక కూటమికి అధ్యక్షుడిగా చేస్తే అని సీనియర్ జర్నలిస్టులు రాజ్ దీప్ సర్దేశాయ్ తో అన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.


దీంతో తెలంగాణలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశం మొత్తంలో ఎన్నికలకు ఖర్చు అయ్యే సొమ్ము కేసీఆర్ దగ్గర ఎక్కడుంది అని, అంత డబ్బు ఎలా సంపాదించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఐఎఏస్ లు ఎన్నికల కమిషన్ డిస్ క్లోస్ చేసిన వివరాలతో కేసీఆర్ ఆఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్లో అప్పుల్లో ఉన్నట్లు ప్రకటించారు. ఇది ఎంతవరకు నిజమన్నది దేవుడెరుగు.


కానీ దేశ వ్యాప్తంగా ఎన్నికలకు అయ్యే ఖర్చు పెట్టగలిగే సత్తా ఉన్న వ్యక్తి, వ్యక్తిగతంగా అప్పుల్లో ఎలా ఉంటారని ప్రతిపక్షాలు, రాజకీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు, సీఎంలలో కేసీఆర్ నెంబర్ వన్  గా ఉన్నారని తెలుస్తోంది. ఈ లెక్క వెనక ఉన్న మర్మమేంటి అనేది అంతు పట్టడం లేదు. అయితే రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికీ వాటిని ఖండించలేదు. కేసీఆర్ అప్పుల్లో ఉన్నారంటే బీఆర్ఎస్ నాయకులు ఎలా తట్టుకుంటారు.. అలా ఎలా జరిగిందనే బాధలో ఉంటారేమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: