బ్రిటన్ లో హిందూ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయాలు జరుగుతున్నాయి. హెన్రీ జాక్సన్ సోసైటీ  నివేదిక ను ఈ అంశంపై తయారు చేసింది. ప్రముఖ విశ్లేషకుడు శాడా శాస్త్రి గారి కథనం ప్రకారం..  బ్రిటిష్ స్కూళ్లలో హిందు విద్యార్థులను వేధిస్తున్నారని తెలుస్తోంది. గోవులను అవమానిస్తూనే విద్యార్థులను వేరు చేస్తున్నారు. సాంఘిక బహిష్కరణ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య హిందు విద్యార్థుల మీద ఆవు మాంసం విసిరిన సంఘటనలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.


హిందువులు వాడే స్వస్తిక్ గుర్తు హిట్లర్ వాడిందనే చెప్పుకొచ్చారు. హిట్లర్ ఎలాంటి హింసను ప్రేరేపించారో మీరు కూడా అలానే చేస్తారని హేళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీసస్ హిందు దేవుళ్లను శిక్షిస్తారని అంటూ మనో వేదనకు గురి చేస్తున్నారు. హిందు పిల్లలు దేవుళ్లను వివిధ రూపంలో మొక్కడాన్ని వివిధ మతాల పిల్లలు చేస్తున్న వ్యాఖ్యలతో వివక్షకు గురవుతున్నారు. క్రైస్తవ మతం గురించి బోధనలు చేస్తూనే హిందూ ధర్మంపై వివక్ష చూపే పాఠాలు బోధిస్తున్నారు. జకీర్ నాయక్ వీడియోలు చూడాలని చెబుతున్నారు. మత పరమైన విధానం బోధించే పాఠాలతో పిల్లలు  తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.


గత సంవత్సరం లీసెస్టర్ షైర్ లో హిందువులపై జరిగిన దాడి తర్వాత ఇలాంటి నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది. పుస్తకాల్లో ఉన్నదే చెబుతున్నా.. హిందు ధర్మం పై అక్కడి టీచర్లకు అవగాహన లేదని పేర్కొంది. చార్లెస్ లిటిల్ హుడ్ ఈ నివేదికపై చర్చ మొదలు పెట్టింది. ఎందుకంటే నిజంగా లీసెస్టర్ షైర్ లో హిందువులపై దాడి జరిగిందా.. లేక కొన్ని మీడియా ఛానళ్లు కావాలనే ఇలా టార్గెట్ చేస్తున్నాయా అని తెలుసుకుంటున్నట్లు చెప్పింది. బ్రిటన్ లో ముస్లిం, క్రిస్టియన్ విద్యార్థులు చేస్తున్న కామెంట్ల వల్ల హిందు విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇలాంటి మతపరమైన నివేదికలు బ్రిటన్ లో రావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: