మిగిలిన విషయాలు ఎలాగున్న తాజాగా మొదలైన ఓ డెవలప్మెంట్ విషయంలో మాత్రం కొందరు ఎంఎల్ఏలు జగన్మోహన్ రెడ్డిపై బాగా మండిపోతున్నారని సమాచారం. తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు నూరుశాతం వ్యతిరేకంగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారికి ఇపుడు మళ్ళీ కీలక పోస్టింగ్ దక్కబోతోందని తెలిసిన దగ్గర నుండి కొందరు ఎంఎల్ఏలు బాగా మండుతున్నారట.  ఈ విషయమై నేరుగా జగన్ తోనే తేల్చుకోవాలని కూడా సదరు ఎంఎల్ఏలు  డిసైడ్ చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ హయాంలో అసెంబ్లీ ఇన్చార్జి సెక్రటరీగా సత్యనారాయణ చక్రం తప్పిన విషయం తెలిసిందే. ప్రజలందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈయన నూరుశాతం టీడీపీ మనిషని. చంద్రబాబునాయుడు, అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు ఏమి చెబితే దాన్ని తూచా చెప్పింది చెప్పినట్లు చేసుకుపోయిన అధికారి. అసెంబ్లీలో వైసీపీ ఎంఎల్ఏలను సస్పెండ్ చేయటంలోను, రోజాను ఏడాది సస్పెండ్ చేయటంలోను సత్యనారాయణ పాత్ర తక్కువేమీ కాదు.




అసెంబ్లీ కార్యదర్శిగా ఇన్చార్జిగా బాధ్యతలు తసుకునేందుకు కూడా ఈయనకు అర్హతలే లేవని అప్పట్లోనే వైసీపీ ఎంఎల్ఏ ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే.  అటువంటి సత్యనారాయణను ఇపుడు అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీగా ప్రత్యేకంగా నియమించబోతున్నారనే విషయం ఎంఎల్ఏల్లో సంచలనంగా మారింది. ఈయన నియామకానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనట. అందుకనే ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి ఎంఎల్ఏలు బాగా మండిపోతున్నారని సమాచారం.  సత్యనారాయణ మీద అనేక ఆర్ధికపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని అప్పట్లో గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ ప్రత్యేకంగా విచారణ జరిపించారు. ఇటువంటి అనేక కారణాల వల్ల తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం అయన్ను కార్యదర్శిగా నియమించలేకపోయింది. పైగా అసెంబ్లీ సెక్రటరీగా ఉండాలంటే లా డిగ్రీ తప్పనిసరి. విద్యార్హతలపైనే అనేక వివాదాలకు తోడు లా డిగ్రీ కూడా లేని కారణంగా చంద్రబాబునాయుడు ఈ అధికారిని ఇన్చార్జిగానే కంటిన్యు చేశారు.




ఇదే సమయంలో సత్యనారాయణ టీడీపీతో అత్యంత సన్నిహితునిగా మెలిగారు. మామూలుగా ఓ అధికారిగా ప్రభుత్వంతో కానీ అధికారపార్టీలో వారితో కానీ సన్నిహితంగా మెలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈయన మాత్రం చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళ ప్రాపకం కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీ ఎంఎల్ఏలపై కక్షపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎంఎల్ఏలను అప్పటి టిడీపీ ప్రభుత్వం అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయటంలో సత్యనారాయణదే కీలక పాత్రగా బయటపడింది. దాంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనను దూరంగా పెట్టేశారు. దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు. సత్యనారాయణ అక్రమాలు, విద్యార్హతల్లాంటి వాటిపై వైసీపీ ఎంఎల్ఏ ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి పెద్ద పోరాటమే చేశారు. గవర్నర్ కు ఫిర్యాదులు చేయటమే కాకుండా విచారణ చేయించటం, కోర్టులో విచారణ జరిపించటంలో కూడా ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ పోరాటం చేశారు.




ఇంతటి వివాదాస్పదమైన అధికారిని ఇపుడు అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ గా నియమించటానికి రంగం రెడీ అయిపోయిందట. ఎవరు సిఫారుసు చేశారో తెలీదు కానీ ఈయన నియామకానికి శాసనవ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేద్రనాధరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారమ్ ఆమోదం అయిపోయినట్లు ప్రచారంలో ఉంది. విషయం తెలిసి ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ మంత్రితో మాట్లాడినా ఉపయోగం కనబడలేదట. దీనికి సంబందించిన ఫైలు ప్రస్తుతం జగన్ దగ్గరకు చేరిందట. తాను అధికారంలో ఉండగా వైసీపీని ముప్పుతిప్పలు పెట్టిన అధికారిని ఇపుడు వైసీపీ ప్రభుత్వమే నెత్తికెక్కించుకుంటోందన్న విషయం పార్టీతో పాటు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని జగన్ తోనే తేల్చుకోవాలని ఎంఎల్ఏలు గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి ఏమి తేలుతుందనేది సస్పెన్సుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: