గ్రేటర్ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు వాడివేడిగా మొదలుపెట్టాయి. బడా బడా నాయకులంతా రంగంలోకి దిగి హడావుడి మొదలుపెట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలంతా కూడబలుక్కుని మరి ఎన్నికల ప్రచారానికి దిగిపోయారు. ప్రజలకు ఎన్నో రకాలైన హామీలు ఇచ్చారు . మీరు మాకు ఓటు వేస్తే చాలు ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాదే అన్నట్లుగా ఎన్నో హామీలను పార్టీల నాయకులు ఇచ్చారు. కోట్లాది రూపాయల సొమ్ములు కుమ్మరించి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎక్కడలేని హడావుడి చేశారు. 



అధికారులు దీనికి తగ్గట్టుగానే భారీ బందోబస్తు తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా హీరోలు సెలబ్రిటీలు , ఎంతోమంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న వీడియో సందేశాలను విడుదల చేశారు. తాము ఓట్లు వేసి మరి సినిమా హీరోలు, సెలబ్రిటీలు ఎంతోమంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న వీడియో సందేశాలను విడుదల చేశారు.  తాము ఓట్లు వేసి మరి , వాటిని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని సందేశం ఇచ్చారు. అయినా ఎక్కడా పెద్దగా పోలింగ్ కు జనం వస్తున్నట్టుగా , పోలింగ్ జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. సమయం నాలుగు దాటినా, ఓటింగ్ శాతం అంతంత మాత్రంగా ఉండడంతో,  గత గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ శాతంకు అయినా చేరుకుంటుందా అనేది అనుమానంగా మారింది. 



వృద్ధులు, వికలాంగులు వంటి వారు ఉత్సాహంగా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినా, యువత ఉద్యోగస్తుల్లో ఎక్కువ నిర్లక్ష్యం కనిపించింది.  ముఖ్యంగా ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు . ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగితే బీజేపీకి అవకాశం ఉంటుందని ముందుగా అందరూ అంచనా వేయగా, ఇప్పుడు మందకొడిగా సాగుతున్న పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందో అనేది అందరూ టెన్షన్ పడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: