విజయవాడ పార్టీలో రోడ్డునపడ్డ తాజా రాజకీయపరిణామాలతో పార్టీపై చంద్రబాబునాయుడుకున్న పట్టేమిటో అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. అధికారంలో ఉన్నపుడు మాత్రమే చంద్రబాబు మాట చెల్లుబాటవుతుందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. నిజానికి అధికారంలో ఉన్నపుడు కూడా అందిరినీ చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోయారు. కాకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబుతో అనేక అవసరాలుంటాయి కాబట్టి ఏదో మాట విన్నట్లు నటించేవారంతే. అదే విషయం ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిరూపితమవుతోంది. విజయవాడ పార్టీలో కీలకమైన ఎంపి కేశినేని నాని, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, అధికారప్రతినిధి నాగూల్ మీరా మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో పార్టీలో సంచలనంగా మారింది.




ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబును ఎంపి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలా కాలం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎంపి కనబడలేదు. నేతలతో కూడా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. దీంతోనే ఎంపి ఏదోరోజు జెండా ఎత్తేస్తాడనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇదే సమయంలో పై ముగ్గరితో ఎంపికి ఏమాత్రం పడటం లేదు. వీళ్ళమధ్య పెరిగిపోతున్న ఆధిపత్య గొడవల కారణంగా మధ్యలో చాలామంది నేతలు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. వీళ్ళని పిలిచి చంద్రబాబు సర్దుబాటు చేద్దామని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. బోండా-ఎంపి మధ్య సామాజికవర్గ సమస్యలు కూడా ఉన్నట్లున్నాయి. దాంతో వీళ్ళ మధ్య విభేదాలు పెరిగిపోయి చివరకు రోడ్డుమీద పడ్డాయి.




ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు చెబితే ఇటు బోండా అటు ఎంపి ఇద్దరు వినటంలేదు. పైకి మాత్రం అధినేత ఎంత చెబితే అంతే అని ఇద్దరు అంటారు. కానీ మళ్ళీ ఎవరి గొడవలు వళ్ళవే. ఇక విశాఖపట్నంలో చూస్తే చింతకాయల అయన్నపాత్రుడితో చాలా మంది నేతలకు పడటంలేదు.  బండారుసత్యనారాయణమూర్తితో కూడా చాలామంది నేతలకు పొసగటం లేదు. అనంతపురంలో జేసీ బ్రదర్స్ అంటే జిల్లాలోని చాలామంది నేతలకు పడదు. చిత్తూరు జిల్లాలో కూడా నేతల మధ్య సఖ్యతలేదు. నంద్యాలలో భూమా-ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య గొడవలు తెలిసిందే. నెల్లూరు జిల్లాలో reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబితే వినే నేతలే లేరు. ఇలా ఏ జిల్లాలో తీసుకున్నా నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీళ్ళని చంద్రబాబు ఎన్నిసార్లు చూర్చోబెట్టి మాట్లాడినా ఉపయోగం కనబడటం లేదు. మొత్తం చూస్తుంటే పార్టీపై చంద్రబాబుకు పట్టు పోయిందన్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: