ఈ డిజిటల్ సభ్యత్వం నమోదుపై గాంధీ భవన్‌లో సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. వీటికి హాజరైన తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పరిస్థితులు సమీక్షించారు. ఫిబ్రవరి 9వ తేదీన మరోసారి డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్ష ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం లోపు ముందుగా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.
కనీసం ప్రతి బూత్ నుంచి 100 మంది సభ్యత్వాలు అయినా నమోదు చేయించారని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను టార్గెట్ ఫిక్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 34వేలపైగా పోలింగ్ బూత్‌ల్లో ప్రతిదాంట్లోనూ పార్టీ సభ్యత్వం ఎన్రోలర్లను నియమించడం తప్పనిసరి అని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులో డిజిటల్ ఖాతా అత్యంత కీలకం అని చెప్పిన రేవంత్ రెడ్డి.. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు, నాయకులు డిజిటల్ మెంబర్ షిప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు.
ఒకసారి డిజిటల్ డేటా అందుబాటులో ఉంటే రాజకీయంగా చాలా ఉపయోగాలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఏఐసిసి కూడా డిజిటల్ మెంబర్ షిప్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. డిజిటల్ మెంబర్ షిప్‌ను నిర్లక్ష్యం చేసే నాయకులను పార్టీలో కొనసాగించలేమని గట్టిగానే చెప్పింది. నాయకులు పట్టుదలతో పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా పూర్తి చేయవచ్చని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ కు అంత సీన్ ఉందంటారా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి