ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడింటికీ కీలకమైనవే.. తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టకపోతే.. ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు వయోభారంతో అంత యాక్టివ్‌గా లేరు.. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే.. 2028 ఎన్నికల వరకూ ఆ పార్టీని కాపాడుకోవడం కష్టం.. పార్టీ ఉన్నా అధికారాన్ని ప్రశ్నించే రేంజ్‌లో ఉండటం కష్టం. అందువల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి తప్పనిసరి అవుతోంది.


అలాగే జనసేన కూడా.. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కేవలం ఒకే ఒక్క సీటు సాధించిన పార్టీ జనసేన.. కాకపోతే.. పవన్ కల్యాణ్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఇంకా జనసేనను ప్రజలు కానీ.. మీడియా కానీ పట్టించుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటకపోతే..ఇక ఆ పార్టీని ఏపీ ప్రజలు మర్చిపోవడం ఖాయం. ఇక జగన్ విషయానికి వస్తే.. 30 ఏళ్లువరుసగా అధికారంలో ఉంటానంటూ వచ్చిన వ్యక్తి.. కనీసం రెండో సారి కూడా గెలవకపోతే.. ఆ మాటకు అర్థం లేకుండా పోతుంది.


అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవడం మూడు పార్టీలకూ తప్పనిసరి వ్యవహారమే. ప్రస్తుతానికి ఏపీలో విపక్షాలు చాలా వీక్‌ గా కనిపిస్తున్నాయి. తెలుగు దేశం ఒక్కటే వైసీపీకి పోటీ ఇ్చే పరిస్థితి కనిపించడం లేదు. అటు జనసేన కూడా ఏదో ఒక పార్టీతో పొత్తుతో వెళ్తే తప్ప.. సింగిల్ గా వెళ్లి సాధించేది ఏదీ లేదని ఆ పార్టీ నేతలకు కూడా అర్థం అయ్యింది. అయితే.. జనసేనాని పవన్ కల్యాణ్ మరీ ఎన్నికలకు రెండేళ్ల ముందే చేతులెత్తేసి పొత్తులు తప్పనిసరి అన్న కోణంలో ప్రసంగించడం ఆ పార్టీ బలహీనతను గుర్తు చేస్తోంది.


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనీయనని చెప్పడం అంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే వెళ్తానని చెప్పడమే కదా. మరీ ఇంత ముందే మేం పొత్తులకు రెడీ అంటే.. భాగస్వామ్య పార్టీలు కూడా దీన్ని క్యాష్ చేసుకుని తక్కువ సీట్లు అంటగట్టే ప్రమాదం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: