ఇక, మరో కీలక పరిణామం.. రాష్ట్రప్రభుత్వంపై విమర్శలుచేసేవారిలోనూ.. రెడ్డి సామాజిక వర్గం దూరంగా ఉంటోందని.. సోము వీర్రాజు భావిస్తున్నారు. వీరంతా.. అధికార పార్టీ నేతలతో రాసుకుని.. పూసుకుని తిరు గుతున్నారని.. ఆయనభావిస్తున్నారు. దీంతో తన మాటను కూడా లెక్కచేయడం లేదని.. ఆయన భావి స్తున్నారు. ఇటీవల కడపలోనిర్వహించి రణ గర్జనకు.. ఆశించిన మేరకు స్పందన లభించలేదు. దీనికి కొందరు రెడ్డి వర్గమే కారణమని సోము అంచనా వేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కూడా వచ్చారు.
కానీ, ఆశించిన స్థాయిలో జనాలను మాత్రం రాబట్టలేకపోయారు. వాస్తవానికి కడపలో ఈ సభను నిర్వహిం చడం ద్వారా.. సీఎం జగన్‌కు గట్టి సంకేతం పంపించడంతోపాటు..జనసేన వంటి పార్టీకి ఉన్న బలానికి తోడు తమకు కూడా బలం ఉందని.. నిరూపించాలని అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఈ సభకు ఆశించిన మేరకు జనాలు రాలేదు. దీని వెనుక సొంత పార్టీలోనే రెడ్డి కమ్యూనిటీ సహకరించడం లేదని.. సోము వీర్రాజు భావిస్తున్నారట. ఇదే విషయంపై.. ఆయన అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు.
అయితే, ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. సోము ఏం చేసినప్పటికీ..తమకు ఏమీ కాదని.. కొందరు నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనికివారిలో ఉన్న భరోసా ఏమిటంటే.. కొందరు నాయకులు ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకుంటున్నారట..జనసేనలో
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి