వాసిరెడ్డి పద్మ.. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ .. ఆ పదవి రీత్యా ఆమెకు కొన్ని అధికారాలు ఉంటాయి. ఆమె మొన్న విజయవాడలో ఓ రేప్ బాధితురాలని సందర్శించేందుకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ ఉన్న తెలుగు దేశం టీమ్ ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. చంద్రబాబు నేరుగా అత్యాచార బాధిత కుటుంబం ముందే వాసిరెడ్డి పద్మను నిలదీశారు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె కూడా సీరియస్‌గా తీసుకున్నారు.


అందుకే తమ ముందు ఈనెల 27న అంటే ఇవాళ విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహిళా కమిషన్ ముందు ఎందుకు హాజరవ్వాల్సిందేనని వాసిరెడ్డి పద్మ అంటున్నారు. మహిళా కమిషన్ గురించి పాఠాలు చెప్పేందుకే చంద్రబాబు, మాజీఎమ్మెల్యే బోండా ఉమకు నోటీసులు జారీ చేసినట్లు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అంటున్నారు. విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార ఘటన, ఆందోళనలు, నోటీసులపై వాసిరెడ్డి పద్మ నిన్న వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.


అత్యాచార బాధితురాలికి వైద్య పరిక్షలు జరిగే సమయంలో టీడీపీ నేతలు లోపలకు వచ్చారని వాసిరెడ్డి పద్మ అంటున్నారు. బాధితురాలి పరామర్శకు వెళ్లే సమయంలో ఎక్కువ మంది వెళ్లకూడదనే కనీస ఆలోచన టీడీపీ వారికి లేకుండా పోయిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాల్ని టీడీపీ నేతలు ఉల్లంఘించినట్లు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. సీనియర్ నేత అయిన చంద్రబాబునాయుడుకి ఈ విషయం తెలియదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.


టీడీపీ శ్రేణులు తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని... అక్కడి కేకలు చూసి బాధితురాలు భయపడి వారందరినీ బయటకు పంపాలని కోరిందని వాసిరెడ్డి పద్మ వివరించారు. తాను  ఓపిగ్గా సమాధానం చెప్పినా టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడారని..వాసిరెడ్డి పద్మ వివరించారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని కూడా తెదేపా నేతలు లెక్కచేయకపోవటం, ఇష్టారాజ్యంగా మాట్లాడటం వల్లే షోకాజ్ నోటీసులు జారీ చేశానన్నారు. వారికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గురించి వారికి పాఠం చెప్పాలనుకున్నానని వాసిరెడ్డి పద్మ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: