పి.ఓ.కే భారత్ లో కలవడం అనేది మొన్నటి వరకు కల. అయితే తాజాగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే అక్కడి ప్రజలే ఇప్పుడు భారత్ లో కలవడానికి ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు సైనిక చర్యల ద్వారా అక్కడి ప్రాంతాన్ని కాశ్మీర్లో తిరిగి కలపాలని ప్రయత్నించినా, ఇప్పటికే భారత్ పై విషాన్ని నింపుకున్న అక్కడి ప్రజలతో సమస్య వస్తుందని మొన్నటి వరకు అనుకున్నారు. కలిసినా బంగ్లాదేశ్ తరహాలోనో, ఈశాన్య రాష్ట్రాల తరహాలోనో అది ఒక తలనొప్పిగా పరిణమిస్తుందని అనుకున్నారు.


అయితే అక్కడి ప్రజలు భారత్ లో కలవాలని కోరుకోవడం వెనక వారి ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. కానీ వారి ఆకలి తీరిపోయిన తర్వాత వారు తిరిగి భారత్ పై మళ్ళీ విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తారని కొంత మంది అంటున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (గిల్గిట్-బాల్టిస్తాన్) భారత్ లో కలవాలని కోరుకోవడం ఇక్కడ చాలామందికి నచ్చడం లేదు. అక్కడి ప్రజల మాటలను బట్టి, భారత్ లోని జమ్ము కాశ్మీర్, లడక్ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే, పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లని మొదటి నుండి ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుందని, వారి ప్రభుత్వం మాత్రం వాళ్లని దోచుకుని తింటుందని, తినడానికి తిండి గింజలు కూడా దొరకడం లేదని వారు వాపోతున్నారు.


లడక్ లోని కార్గి, గిల్గిట్-బాల్టిస్తాన్ లను కలిపే రహదారిని పునరుద్ధరించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు సాంస్కృతికంగా లడక్ ఇంకా టిబెట్లకు దగ్గరగా ఉంటారు. దాంతో వారు పాకిస్తాన్ లో కన్నా ఇండియాలో ఉంటేనే వారికి భద్రతగా ఉంటుందని భావిస్తున్నారు. గిల్గి, షినా, రురు, కులవర్ భాషలు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. లడక్, టిబెట్ ప్రజల మాదిరే వాళ్లు కూడా సౌమ్యులు. జమ్ము కాశ్మీర్ లోని ఆర్టికల్ 317ని రద్దు చేసినట్లుగానే ఇప్పుడు పి.ఓ.కే ని భారత్ లో కలిపితే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

pok