పొదుపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అరుదైన ఘనత లభించింది. ఎనర్జీ ఎఫిషీయన్స్ లో దేశంలో ఆంధ్ర బ్రాండ్ మారుతోంది. మూడున్నర వేల కోట్ల రూపాయాలను మిగిల్చుకుని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని బ్యూరో ఆప్ ఎనర్జీ ఎపిషీయన్స్ సెక్రటరీ ఆర్ కె రాయ్ అన్నారు. ఇంధన నిర్వహణ సామర్థ్యంలో ఏపీ లీడర్ గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.


దేశంలో రాష్ట్రపతి అవార్డు ఏపీ సీఎం దక్కించుకోవడం వారు చేస్తున్న పనులకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. పవర్ ప్లాంట్, సిమెంట్, డిస్ట్రిబ్యూటర్ సంస్థలు, 53 గుర్తింపు పొందిన పరిశ్రమలు డీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్యాలను అమలు చేస్తున్నాయి.
దీంతో ఏపీ ఇందన సామర్థ్యాన్ని సరిగా వినియోగించుకుంటుంది. దీని ద్వారా మూడు వేల నాలుగు వందల మిలియన్ యూనిట్లను ఆదా చేస్తున్నాయి. పర్పర్మ్ అచీవ్ ట్రేడ్ ప్యాట్ అమలు పరచడంలో చక్కగా వ్యవహరిస్తుందంటూ ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం కితాబు ఇచ్చింది.


ఇంధన సామర్థ్య నిర్వహణలో ఏపీ వినియోగిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో పాటిస్తే  ఇంధనాన్ని సరిగా వాడుకోవచ్చని అంటున్నారు. ఎక్కువగా పరిశ్రమలు ఉంటే చోట పవర్ ఎక్కువగా ఖర్చు అవుతు ఉంటుంది. కానీ దాన్ని ఎలా వాడుకోవాలి.. ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎక్కడ దాన్ని తక్కువగా వాడాలి. పరిశ్రమలు, ఇతర వాటికి వాడే విషయంలో ఏ విధమైన విధానాన్ని పాటిస్తే అది ఎంతమేరకు సక్సెస్ అవుతుందో తెలుసుకోవాలి.


తద్వారా డబ్బులను ఆదా చేసుకోవడంతో పాటు ఉత్పత్తికి అయ్యే ఖర్చు మిగులుతుంది. కేంద్రం ఏపీ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా చూస్తే ఆయా రాష్టాల్లో ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. ఎలాంటి విధానాల వల్ల ఏపీకి ఇది సాధ్యమయిందో అన్ని రాష్ట్రాలు తెలుసుకోనేలా ఒక ప్లాన్ ను ఇవ్వాలి. తద్వారా లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP