పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. దాదాపు 75 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది. పాకిస్థాన్ కు 1947 సంవత్సరం ఆగష్టు 14న స్వాతంత్య్రం వచ్చింది. గతంలో 1971లో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది. దానికి కారణం భారత్, పాక్ యుద్ధం. బంగ్లాదేశ్ ఏర్పాటు గురించి జరిగిన యుద్ధంలో భారత్ తో పాక్ యుద్ధం చేసింది. ఇందులో ఓడిపోయింది. భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చుకోవడం, సైన్యానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం అనంతరం జరిగిన పరిణామాలతో పాక్ ఆర్థికంగా కుదేలైంది.


భారత్ ఈ యుద్ధనాంతరం నిలదొక్కుకుంది. ఆ సమయంలో పాక్ లో 21 శాతం ధరలు పెరుగుదల కనిపించింది. 1947 సమయంలో పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, బౌద్ధులపై ఊచకోత జరిగింది. ఆ సమయంలో వారిని పాకిస్థాన్ నుంచి వెళ్లగొట్టాలని పాక్ తన వద్ద ఉన్నటువంటి డబ్బులను అన్నింటినీ విపరీతంగా ఖర్చు పెట్టేసింది. కాశ్మీర్ ను లాక్కోవడానికి పీవోకే లోకి గిరిజనుల పేరుతో చొరబడటం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభం లోకి పడిపోయింది. దీంతో అప్పట్లో 24 శాతం ధరల పెరుగుదల కనిపించింది. దీంతో పాక్ అడుక్కుని తినే పరిస్థితి నెలకొంది. దీంతో మహాత్మా గాంధీ నిరసన చేపట్టారు.


పాకిస్థాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుంది. దేశ విభజన సమయంలో వారికి 75 కోట్ల రూపాయాలు ఇస్తామని అన్నాం. అందులో రూ.25 కోట్లు ఇచ్చాం. రూ. 50 కోట్లు కూడా వెంటనే ఇవ్వాలని గాంధీజీ అమరణ నిరాహార దీక్ష చేశారు. దీంతో ఆ డబ్బుల్ని భారత్, పాక్ కి ఇచ్చేసింది. ఆ డబ్బులతోనే పీవోకేను మొత్తం పాక్ కబ్జా చేసేసుకుంది. దీని మీద కోపంతోనే నాథురాం గాడ్సే గాంధీజీని కాల్చి చంపారని చెబుతారు. వీటిన్నింటిని తలదన్నుతూ పాక్ లో ప్రస్తుతం ధరల పెరుగుదల దాదాపు 25 శాతంగా ఉంది. ఇంతటి దారుణ పరిస్థితికి పాకిస్థాన్ దిగజారిపోయిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: