ఏవైనా వ్యాపార సంస్థలు ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ అభివృద్ధితో పాటు తమ సంస్థలో పని చేసే వారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఎంత పెద్ద వ్యాపార సంస్థ అయినా కొన్ని రోజుల్లో కుదేలవుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక వస్తువును చాలా మంది ఇష్టంగా కొనుక్కుంటారు. దానిని వాడటానికి ఇష్టపడతారు. కానీ దాని కంటే మెరుగైనది వచ్చినపుడు దానిని పక్కన పెడతారు. మరింత మెరుగైనది వస్తే దాన్ని ఉపయోగించడానికి వెనకాడారు. ఇలా ఎప్పటికప్పుడు వ్యాపారంలో మెరుగుపడాలంటే మానవ మెదడులో పుట్టిన ఆలోచనలకు అనుగుణంగా ఆయా పనులను చేయాల్సిందే.


కానీ ఒక విచిత్రమైన వ్యాపారం ఇప్పుడు అమెరికాలో కొనసాగుతోంది. ఒక వ్యవస్థను, వ్యాపారాన్ని నాశనం చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ హిండెన్ బర్గ్ అని విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉన్న స్వేచ్ఛను ఆధారం చేసుకొని హిండెన్ బర్గ్ లాంటి వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని వేరే సంస్థపై అభియోగాలు మోపి వాటిని క్యాష్ చేసుకోవడం అలవాటుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది.
 

ఇలాంటి కంపెనీలను మూడింటిని అమెరికా కూడా బ్యాన్ చేసింది. వీరి పని కొన్ని కంపెనీల పేరు ప్రతిష్టలను దెబ్బతీసి వాటిని నష్టపరచడమే. అమెరికాలో ఇలాంటివి ఇప్పుడు నడవడం లేదు కాబట్టి హిండెన్ బర్గ్ భారత్ ను ఎంచుకుందంటున్నారు. అందులో అదానీ కంపెనీలను టార్గెట్ చేసి విష ప్రచారాన్ని చేశారని దీంతో అదానీ కంపెనీలు తీవ్ర నష్టాలను చవి చూశాయని అంటున్నారు.


దీంతో గౌతమ్ అదానీ అమెరికాలో చట్ట పరంగా హిండెన్ బర్గ్ పై చర్యలు తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన న్యాయ సంస్థలో వాచ్ టెల్ లా పార్మ్ ని అదానీ సంప్రదించారు. ఇలాంటి కేసుల్లో చాలా బలంగా తమ వాదనలు వినిపించడంలో ఈ సంస్థ దిట్ట. హిండెన్ బర్గ్ సంస్థపై అదానీ లీగల్ గా వెళ్లి విజయం సాధించి తన వైపు తప్పు లేదని నిరూపించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: