అనంతరం జరిగిన పరిణామాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగారు. తర్వాత ఆస్తులు ఏమయ్యాయి. ఎక్కడికి పోయాయి. వేల ఎకరాల భూములు ఎక్కడికి వెళ్లాయి. అయితే వేల ఎకరాల్లో కాకుండా కొన్ని వందల ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కేఏ పాల్ సోదరుడి పేరు మీద ఉండేవి. అతను హత్యకు గురయ్యాడు. తర్వాత భూముల అంశం వివాదంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా కేఏ పాల్ కు ఎక్కువ పేరు తెచ్చిన అంశం క్యూబా వివాదం. దీని పరిష్కారంలో కేఏ పాల్ కీలక పాత్ర పోషించడంతో అమెరికా వైట్ హౌస్ లోకి కూడా ప్రవేశించగలిగాడు. కేఏ పాల్ సోదరుడి హత్య తర్వాత ఆయన భూములు, ఆస్తుల వ్యవహారం 10, 12 మంది ఆయన అనుచరులు చూసుకునేవారు. ఇప్పుడేదో కమెడియన్ మాటలు మాట్లాడుతున్నారని ఆయన్ని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఆయన ఆస్తుల పై అంతర్జాతీయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కేఏ పాల్ ఆస్తుల వెనక అతి పెద్ద కుంభకోణం ఉందని మేధావులు ఆరోపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి