ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పై అవినీతి ఆరోపణలు లేవని అందరూ అంటారు. తన సినిమాలేవో తను చేసుకుంటూ, పక్కవాడికి ఆపదలో ఉన్నప్పుడు ఎంతో కొంత సహాయం చేసే గుణం తప్ప మరొకటి లేదని అంటుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు అంటూ ప్రొజెక్ట్ చేసుకువస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి కి సంబంధించిన వాళ్ళు. వాళ్లు ఏం చెప్పుకు వస్తున్నారంటే అమరావతి రాజధానికి సంబంధించి ఆయన సపోర్ట్ చేసినందుకు గాను ఆయనకు కొంత ముట్ట చెప్పారని అంటున్నారు.


అమరావతి భూముల కుంభకోణంలో ఒకటైనటువంటి లింగమనేని హౌస్ దగ్గరే రెండున్నర ఎకరాలు ఫ్రీగా ఇప్పించారని తెలుస్తుంది అంటున్నారు వాళ్లు. అతి నామమాత్రపు రుసుము తో రెండున్నర ఎకరాలు ఒకరకంగా ఉచితంగానే పొందినట్లుగా చెప్తున్నారు వాళ్లు. ఈ పాపంలో ఆయన పాత్ర కూడా అంటూ వాళ్లు చెప్పే దానిపై సాక్షిలో రాసుకొచ్చారని తెలుస్తుంది.  అయితే దీనికి ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ పవన్  చంద్రబాబుకి దత్తపుత్రుడు. మొదట నుంచి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు అని అన్నారట.


మొదటిసారి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి నన్ను అడ్డుపడ్డారు. రెండోసారి చంద్రబాబుకి వ్యతిరేక ఓటును చీల్చడం కోసం ఆయన సొంతంగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్లీ నన్ను రాబోయే ఎలక్షన్లలో గద్దె దించడం కోసం చంద్రబాబు నాయుడుని గెలిపించడం కోసం మళ్లీ కలుస్తున్నారు ప్యాకేజి స్టార్ అంటూ  కామెంట్ చేశారు జగన్.


గతంలో తనను ప్యాకేజి స్టార్ అన్నందుకు చెప్పుతో కొడతాను అలా అన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జగన్ ఆ విధంగా ప్రసంగించారు. దాంతో పవన్ కళ్యాణ్ దానికి రిటార్ట్ గా పాపం పసివాడు అనే పేరుతో ఒక కార్టూన్ క్రియేట్ చేసి జగన్ సూట్ కేసులు మోసుకు వెళ్తున్నట్టుగా  చూపించారు.‌ పక్కనే పింక్ కలర్ ఓన్లీ అని కూడా రాసి ఉంది దాని అర్థం ఏమిటో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: