
పవన్ ప్రస్తుతం జగన్ పై రాజకీయ విమర్శల పదును పెంచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా కురిసిన వర్షానికి అన్నమయ్య ప్రాజెక్టు 2021 లో డ్యాం కట్ట కూలిపోయింది. హఠాత్తుగా వచ్చిన వరదల కారణంగా చేవేరు నది ఒడ్డున ఉన్న గ్రామాలు, మందపల్లి, తొగురుపేట, పులపటూరు, గుండ్లూరు గ్రామాల్లో 33 మంది జల సమాధి అయ్యారు.
ఆ వరదల్లో 33 మంది చనిపోవడంతో సీఎం జగన్ వెంటనే ఇలాంటి ఘటనలు జరగకుండా చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హై లెవల్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిటీ ఏమైందో అది ఏ నిర్ణయం తీసుకుందో జగన్ చెప్పాలని పవన్ సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ను వచ్చే ఏడాదిలోగా పునర్ నిర్మిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆ పనులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు.
ఈ ఘటన జరిగి 18 నెలలు పూర్తవుతున్నా ఎలాంటి పనులు జరగలేవని విమర్శించారు. అన్నమయ్య డ్యాంను తిరిగి నిర్మిస్తామని చెప్పినా.. పొంగులేటికి 660 కోట్ల రూపాయలకు అప్పజెప్పారు. దీనిపై పార్లమెంట్ లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం విమర్శించినా కూడా పట్టించుకోవడం లేదంటూ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.