భారత్ లో జీ 20 సదస్సు జరుగుతోంది. ఇది జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో మూడు రోజుల పాటు జరగనుంది. దీనిపై కాశ్మీర్ లో జీ 20 సదస్సుపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే వీటిన్నింటినీ పట్టించుకోకుండా భారత్ తన పని తాను కానిచ్చేస్తుంది. కాశ్మీర్ ప్రశాంతంగానే ఉంది. కానీ దాని విషయంలో పాక్ కావాలనే గొడవలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు జీ 20 సదస్సు ద్వారా నిరూపించవచ్చు.


వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులను గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనికి ఆ దేశ ప్రభుత్వం తీసుకెళ్లింది. కానీ అక్కడ వారు ప్రజలు పడుతున్న బాధలు గమనించారు. తిండి దొరక్క అల్లాడుతున్న విషయాన్ని గ్రహించారు. భారత్ లో ఉన్న కాశ్మీర్ లో ప్రజలు విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. ఈ సందర్భంగా గల్ప్ దేశాలకు సంబంధించి ఉన్న ఇన్లూయెన్సర్ ను తీసుకొచ్చింది. దాదాపు 60 దేశాలకు సంబంధించిన వారిని ఆహ్వానించింది. సైదీకి సంబంధించిన ఇన్లూయెన్సర్ అంజాద్ తాహ అనే వ్యక్తి ఒక వీడియో పోస్టు చేశారు.


అందమైన అద్బుతమైన లోయ ఇది అని వివరించారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ లోయ ప్రాంతం ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటని అన్నారు. ఇక్కడికి వచ్చిన 60 దేశాల పర్యాటక మంత్రులు కూడా శ్రీనగర్ అందాలను చూసి మైమరిచిపోయారు. టూరిజానికి అద్భుతమైన కేంద్రం కాశ్మీర్ అని వారికి భారత్ చూపించగలిగింది. ఈ సమావేశాలకు చైనా, టర్కీ రెండు దేశాలు రాలేవు. ఈ సదస్సు కాశ్మీర్లో నిర్వహించడం వల్ల బాయ్ కాట్ చేశాయి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు, ఇండియా లో ఉన్న కాశ్మీర్ కు ఎంతో తేడా ఉందని అర్ధమయ్యే విధంగా, ప్రపంచ దేశాధినేతాలకు తెలిసే విధంగా జీ 20 సదస్సును కాశ్మీర్ లో నిర్వహించడం భారత ప్రభుత్వ విజయం.

మరింత సమాచారం తెలుసుకోండి: