వాతావరణం ప్రభావం అనేది ప్రాణికోటి అందరి మీద ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వాతావరణ ప్రభావం లో వచ్చే అనుకోని మార్పులు దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారతాయని చెప్పుకొస్తున్నారు రాజకీయ నిపుణులు. అతి ఎండలు ఇంకా అనుకోని వర్షాలు ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి అని తెలుస్తుంది.


ఇవి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా చాలా ఉద్యోగాలు  పోయే పరిస్థితి ఏర్పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఒక లెక్క చెప్తుంది. ఈ మధ్యకాలంలో కార్బన్ ఉద్గారాల పరిమాణం దేశంలో పెరిగిందని తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణాల కారణంగా, అడవుల నరికివేతల కారణంగా,  లోహ ఉత్పత్తుల కారణంగా, నీటి రవాణా, వైమానిక రవాణాల కారణంగా కర్బన ఉద్గారాలు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది.


గనులు, క్వారీ, విద్యుత్, గ్యాస్ రవాణా వీటన్నిటి ద్వారా కర్బన ఉద్గారాల శాతం పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు భారీగా పెరగబోతున్నట్లుగా తెలుస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాస్, పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే ఎల్వినోల కారణంగా ఎండల తీవ్రత అనేది విపరీతంగా ఉండబోతుంది అని చెప్తున్నారు ప్రపంచ వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు. 2023 నుండి 2027 మధ్యకాలంలో సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు.


ఈ ఐదేళ్లలో ఏదో ఒక సారి గరిష్ట ఉష్ణోగ్రతలు కచ్చితంగా  నమోదు అవ్వడం ఖాయమని వాళ్ళు చెప్తున్నారు. 2015నుండి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థపై ఈ వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. 2030నాటికి 4.5% జిడిపికి ముప్పు అని, 3.4కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎండలు పెరిగినా, వర్షాలు పెరిగినా దానిపై ఆధారపడే పంటలు, తద్వారా ఇండస్ట్రీలు అన్నిటికీ ముప్పే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: