అంతః కలహాలు అనేవి ఏ దేశానికైనా చాలా ప్రమాదం. ముఖ్యంగా సైన్యంలో అంతః కలహాలు అనేవి ఆ దేశ పతనానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు రష్యా సైన్యంలో అంతః కలహాలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ రష్యా సైన్యం అంటే రెండు రకాల సైన్యం అని చెప్పాలి. ఆ దేశ అధ్యక్షుడు అయినటువంటి పుతిన్ కు సంబంధించిన ఒక సైన్యం వ్యాగన్ గ్రూప్ ఇంకా చెచన్ గ్రూప్.


మరో పక్కన ఆర్మీ, నేవీ, మిలట్రీలతో కూడిన సైన్యం. ఈ రెండు రకాల సైన్యం రష్యాకు అండగా ఉంటూ వస్తున్నాయి. అయితే  భాగ్పుత్ విషయంలో వ్యాగనార్ గ్రూపు వల్ల అక్కడ సైన్యంలో కూడా గొడవలు వచ్చినట్లుగా తెలుస్తుంది. దానికన్నా ముందే రష్యా సైన్యానికి, వ్యాగనార్ గ్రూప్ హెడ్ కి కూడా గొడవలు వచ్చాయి. అయితే  రష్యా సైన్యం మధ్య ఎన్ని గొడవలు వస్తున్నా వాళ్లలో వాళ్లు మాత్రం దాడులు చేసుకోవడం లేదని తెలుస్తుంది.


కానీ ఉక్రెయిన్ లో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుందట.  ఉన్నతస్థాయి అధికారికి, క్రింది స్థాయి అధికారికి మధ్యన అక్కడ గొడవలు వచ్చాయని తెలుస్తుంది. పర్యావసానంగా ఉన్నతాధికారి తను సబార్డినేట్ ను చంపినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది. అంతః కలహాలలో ఇది పతాక స్థాయి అని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నత స్థాయి అధికారులు రష్యాకి  అనుకూలంగా పనిచేస్తుంటే వాళ్ల సబార్డినెట్స్ మాత్రం ఉక్రెయిన్ తరుపున రష్యాతో యుద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.


ఈ రకమైన డిస్ప్యూట్ వల్ల ఉక్రెయిన్ సైన్యం లోని ఉన్నతాధికారి తన సబార్డినేట్ పై బాంబు విసిరి మరీ చంపాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై విచారణ జరుగుతుంది. ఏ దేశంలో నైనా ఆ దేశపు సైన్యం మరొక దేశపు సైన్యంతో పోరాడి గెలుపునో, ఓటమినో చవిచూస్తారు.‌ కానీ ఇక్కడ సైన్యం మాత్రం తమలో తామే కొట్టుకొని తమ దేశ పతనానికి కారణం అవుతున్నారు అని  కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: