గతంలో తెలుగు దేశం పార్టీకి కాపు సామాజిక వర్గం వాళ్లు, బిసి వర్గం వాళ్లు, ఇంకా ఎస్సీ వర్గం వాళ్లు అండ దండగా ఉండేవారు. ఎస్సీ సామాజిక వర్గం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీకి అండగా ఉండే వారు. కానీ ఇదంతా గతం. తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అధికారంలోకి వచ్చినా తమకు ఏమీ చేయడం లేదని వాళ్లు ఒక భావానికి వచ్చేసారు. దాంతో వాళ్లంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపుగా మళ్ళి పోయారు అని సమాచారం.
దాంతో తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ లో బలహీన పడిందని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ కి ఎంత ఫాలోయింగ్ అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఫాలోయింగ్ ఉందని అంటారు. ఆ వర్గం వాళ్లందర్నీ ఇటు తెలుగుదేశం వైపుకు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వాడుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అవినీతిపరుడని విమర్శిస్తూ ఉంటారు.
కానీ మీ తాట తీసేస్తాం, రాష్ట్రం వదిలిపెట్టి పంపించేస్తాం అన్నట్లుగా మాత్రం మాట్లాడరు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతూ యూత్ ను రెచ్చగొడుతున్నారని అంటున్నారు. తన అభిమానులను సోషల్ మీడియాలో వైసిపి కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ద్వారా వైసీపీని భయపెట్టాలని చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి