కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. అప్పుడు దోస్తీ కట్టిన బీజేపీతో 2019 లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో 2022 లో తెగ దెంపులు చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్ర నష్టపోవడానికి కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలే అని తెగ ప్రచారం చేసేశారు. దీంతో ఇప్పుడు పొత్తు పెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్డీఏ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పిలిచారు. కానీ చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు.
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన చంద్రబాబును ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ మిత్ర పక్షాల మీటింగ్ కు పిలవకపోవడం చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న గత యూపీఏ ప్రస్తుతం ఇండియా మీటింగ్ కు కూడా చంద్రబాబుకు పిలుపు అందలేదు. దీంతో టీడీపీ ఏకాకిగా మిగిలిపోయింది. కేంద్రంలో ఏదో పక్షంతో పొత్తు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎటు కాకుండా ఉండటం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటు పడుతుంది.
కానీ చంద్రబాబు అవేవీ పట్టించుకోకుండా పూర్తిగా ఆంధ్రలోనే పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దృష్టి ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి విజయం దక్కకపోతే పార్టీ చాలా నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి