చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు మౌన పాత్ర వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ సర్కారు పై టిడిపి నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేస్ లో అకారణంగా బాబు ను అరెస్ట్ చేశారని వైసీపీ పై  తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని విరుచుకు పడుతున్నారు. అయితే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఇటు వైసీపీ ని టీడీపీ ని పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు అరెస్టు అక్రమం అని ప్రెస్ మీటు పెట్టి మరీ చెప్పారు. దీంతో బీజేపీ టీడీపీ ఒకటీ అని చాలా విమర్శలు వచ్చాయి


ముఖ్యంగా వైసీపీ  నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి తీరు పై నిరసన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ కేంద్రం లోని బీజేపీ నాయకులను కలవడానికి వెళ్లిన వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయం లో వైసీపీ నేతలు టిడిపి తీరుపై విమర్శనాలు చేస్తున్నారు చంద్రబాబుకు ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయం అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు


చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు అవినీతి చేశాడని సరైన ఆధారాలు ఉండబట్టే ఆయనకు జైలు శిక్ష పడిందని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఒక మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ విధంగా వ్యవహరించడంపై ఆందోళన చెందుతున్నారు మొత్తం మీద టిడిపి అధినాయకుడు జైల్లో ఉండడం వారికి మింగుడు పడని విషయంగా మారింది జైలు నుంచి తొందరగా విడుదలవుతాడని టిడిపి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: