గతంలో భారత్ ను చీల్చే కుట్రలో పాకిస్థాన్ కేంద్రంగా నడిచేవి. అమెరికా తెర వెనక ఉండి.. చైనా నేరుగానే దానికి నిధులిచ్చి ప్రోత్సహించేంది. అయితే ఆ నిధుల్ని ఎక్కువగా ఉగ్రవాదులను తయారు చేయడానికి ఉపయోగించేవారు. అంతే కానీ అభివృద్ధికి ఉపయోగిస్తే పాక్ కొంతైనా డెవలప్‌ అయ్యేది. ఇప్పుడు చైనాకు అమెరికా కు పడటం లేదు. కాబట్టే చైనా ను పక్కన పెట్టింది అమెరికా. అదే సమయంలో పాక్ ను కూడా దగ్గరకు రానీయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా, పాక్ లు అవసరం లేదు.


అమెరికాకు చైనాను ఎదుర్కొవాలంటే కచ్చితంగా భారత్ సాయం అవసరం. అందుకే ఇప్పుడు అమెరికా భారత్ ను అత్యంత మిత్ర దేశంగా పరిగణిస్తోంది. అయితే భారత్ ను ముక్కలు చేసేందుకు చైనా, పాక్, కెనడాలోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు, అమెరికాలో ఉన్న సోరెస్ అనే సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా భారత్ కు మద్దతిస్తూనే దేశాభివృద్ధి సాధించే విషయంలో మాత్రం ఓర్చుకోలేకపోతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చు పెట్టే సమయంలో చైనా పాత్ర ఉందని తేలింది. ముఖ్యంగా మణిపూర్ అల్లర్ల విషయంలో బర్మా నుంచి వచ్చే వారికి నిధులు అందించే విషయంలో చైనా పాత్ర ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా అమెరికా లోని సోరోస్ సంస్థ కూడా నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఖలిస్థాన్ ఉగ్రవాదులను కెనడా మద్దతిస్తోంది. అంతే కాకుండా పాక్ తో గొడవలను అడ్వంటేజ్ తీసుకుని చైనా తన వక్రబుద్ధిని చాటుకుంటోంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న కొంతమంది మేధావులు మాత్రం భారత్ ను దెబ్బకొట్టొద్దు.. భారతే రేపు చైనా ఎదుర్కొవాలంటే సరైన దేశమని చెబుతున్నారు. మరి సోరోస్ లాంటి  వారు దీన్ని అంగీకరించరు. హర్ దీప్ సింగ్ నిజ్జర్ కట్టించిన గురుద్వారాకు కెనడాకు వెళ్లిన ఈశాన్య రాష్ట్రాల వారు దేశ విచ్చిన్నానికి సహకరిస్తామని మాట్లాడిన కెనడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం.

మరింత సమాచారం తెలుసుకోండి: