దీనిపై ఆ దేశాధినేత అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇజ్రాయెల్ సైన్యం, ఇంటిలిజెన్స్ కు ఇది కోలుకోలేదని దెబ్బఅని పేర్కొన్నారు. ఈ దాడిలో తమ హస్తం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో యూదు పాలకులపై దాడి చేసిన వారిని ముద్దాడుతానని అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పాలస్తీనా స్కార్ప్ ధరించడం కొసమెరుపు.
మరోవైపు ఇజ్రాయెల్ పై తాము చేసిన మెరుపుదాడికి ఇరాన్ మద్దతు ఉందని హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సౌదీ సంబంధాలు ఏర్పర్చుచుకోవడానికి అవసరమైన ఒప్పందానికి చేరువైన సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకుండా చేసేందుకు ఇరాన్ ప్రోత్సాహంతో ఈ దాడి జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేసింది. అయితే అంతర్జాతీయంగా పరిణామాలు మారుతుండటంతో ఇరాన్ స్వరం మార్చిందని పలువురు పేర్కొంటున్నారు.
మరోవైపు అమెరికాను దెబ్బకొట్టేందుకు ఇరాన్ వేసిన ఎత్తుగడ అని కొందరు అంటున్నారు. అందువల్లే మతాన్ని రెచ్చగొట్టి ప్రపంచ తీవ్రవాదాన్ని అమెరికా వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనికి అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే ఈ దేశం నుంచే అమెరికాకు సమాచారం అందుతోంది. ముందు ఇజ్రాయెల్ ను అడ్డుకుంటే ఆ తర్వాత అమెరికాను దెబ్బకొట్టొచ్చు అనేది ఇరాన్ వ్యూహం కావొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి