తెలంగాణ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇవాళ ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు తమ కూడికలు, తీసివేతలతో కుస్తీ పడుతున్నారు. తమకు అనుకూల, వ్యతిరేక ఓట్లను లెక్కేసుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ కలకు తెలంగాణ ప్రజలు బ్రేకులు వేశారనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.


దీంతో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. కానీ గులాబీ బాస్ ఆవేమీ పట్టించుకోకుండా వారందరికీ టికెట్లు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు ఇలా ప్రభుత్వ వ్యతిరేకత ఓ కారణం అయితే బీజేపీ మరో కారణం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్రా సెంటిమెంట్ ను రగల్చి కేసీఆర్ విజయవంతం అయ్యారు. అదే సమయంలో ఆరెండు పార్టీల పొత్తును బీజేపీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోయారు.  దీంతో బీజేపీ బలహీనంగా ఉన్నచోట బీఆర్ఎస్ కు ఓటేశారు. గతంతో పోల్చితే ఈ సారి బీజేపీ బలం పెరిగింది.  దీంతో ఈ దఫా బీజేపీ కార్యకర్తుల తమ అభ్యర్థులకే ఓట్లేశారు. అది బీఆర్ఎస్ కు మైనస్ గానే చెప్పవచ్చు.


ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి మాదిగలు టీడీపీకి, మాలలు కాంగ్రెస్ కు మద్దతిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు మాదిగలు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారారు. ఈ దఫా ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రకటించడంతో కొంతమేర వారు బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో పాటు ముస్లిం ఓటర్లు కూడా గతంలో గంపగుత్తుగా కారు గుర్తుపై ఓటేశారు. ఈ సారి మాత్రం వారు ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్మానాలు చేశారు. ఎంఐఎం లేని చోట కాంగ్రెస్ కు ఓటేయాలని వారు సూచించారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన తర్వాత ఓటర్లు ఎటు వైపు మళ్లారు అనేది ఆసక్తికరం.

మరింత సమాచారం తెలుసుకోండి: