ఏపీలో కూడా మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ కూడా ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఏపీ ఎన్నికలకు ముందే వచ్చిన తెలంగాణ ఎన్నికలు ఏపీ పార్టీలకు ఓ సవాల్ గా మారాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓ కారణం అని చెప్పవచ్చు.  ఎందుకు అంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత సచివాలయం వద్ద ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి ఆనందోత్సవాలతో డ్యాన్సులు వేస్తారని ఎవరూ ఊహించలేదు.


అయితే ఏపీ విషయానికొస్తే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పింది ఎవరు అని అనుకుంటున్నారా.  ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఎందుకు అంటే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడం లేదు అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  కానీ వాస్తవాలు వేరేవి ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.  తమ పిల్లలకి నాణ్యమైన విద్య అందాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.


ఎప్పటికప్పుడు వాళ్ల  ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి తక్కువ మార్కులు వస్తే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తారు.  అలాగే ప్రభుత్వ  ఉపాధ్యాయుడు కూడా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తుంటారు.  స్తోమత లేని వారు ప్రభుత్వ బడికి పంపి తమ పిల్లలు బాగా చదవాలని కోరుకుంటారు.  వీళ్లను సానబెట్టడమే ఉపాధ్యాయుడి విధి.


కొంతమంది టీచర్లు బాధ్యాతాయుతంగా పని చేయడం లేదని జగన్ సర్కారు భావించింది.   అందుకే ఆయా పాఠశాలలకు అధికారులను పంపించి వాళ్లను ప్రశ్నిస్తోంది. తనిఖీలు నిర్వహించి ప్రవర్తన సరిగా లేకుంటే మోమోలు జారీ చేస్తుండటంతో కోపోద్రిక్తులైన ఉపాధ్యాయులు మిమ్మల్ని ఓడిస్తాం అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.  తాజాగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. టీచర్లను తనిఖీల పేరుతో బెదిరిస్తూ ఛార్జీ మెమోలు జారీ చేస్తూ ఇంక్రిమెంట్లో కోతలు విధిస్తున్నారు.  దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.  రాబోయే ఎన్నికల్లో కచ్ఛితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: