కొత్త ఆలోచనల నేపథ్యంలో పుట్టిన పార్టీ జనసేన. 2014లో పవన్ కల్యాణ్ దానిని స్థాపించినప్పుడు దాని అజెండాలను ప్రజలకు వివరించాడు.  జీరో పాలిటిక్స్  లక్ష్యంగా అవినీతి లేని సమాజం అనే నినాదంతో ముందుకు సాగారు.  యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.  సమాజంలో మార్పు రావాలంటే అది జనసేనతోనే సాధ్యం అది పలు సభల్లో చెబుతూ ఉంటారు.


జన సేనాని పవన్ కల్యాణ్ తో కలిసి నడిస్తే తమ బతుకులు మారతాయాని పలువురు యువతీ యువకులు ఆయన వెంట నడవడం మొదలు పెట్టారు.  రాజకీయాలతో సంబంధం లేని చిరు వ్యాపారులు సైతం జనసేనాని బాటలో నడిచేందుకు సిద్ధం అయ్యారు.  రాజకీయాలకు డబ్బులు అవసరం లేదు. సేవ  చేయాలనే సంకల్పం ఉంటే చాలు అని నమ్మించారు. అయితే  తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్త, టీ టైమ్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయం శ్రీనివాస్ ను జనసేనలో చేర్చుకున్నారు.


గతంలో జీరో పాలిటిక్స్ అని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు దానికి సరికొత్త అర్థం చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే డబ్బులు బయటకి తీయకపోవడం కాదు. కార్యకర్తలకు ఖర్చు పెట్టాలి. అలాగే ఎన్నికలకు సైతం ఖర్చు చేయాలి. కాకపోతే ఓటర్లకు డబ్బులు పంచకూడదు ఇదే తమ విధానమని వివరించారు. తద్వారా డబ్బులు ఉంటేనే ఎన్నికల్లో సీట్లు ఇస్తామనే విషయాన్ని నొక్కి చెప్పినట్లయింది.  


టీడీపీతో పొత్తు నేపథ్యంలో సగటున రూ.10 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే పిఠాపురం టికెట్ ను టీటైమ్ వ్యవస్థాపకుడు కి ఇస్తున్నారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆయన్ను పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీలో చేరకముందే అతని వ్యాపారం రూ.10 కోట్లు ఉంటే ఇప్పుడు అది ఏకంగా రూ.100 కోట్లకు చేరింది. ఇది సంచలనాత్మకమైన ఎదుగుదల అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూ.పదుల కోట్లలో ఉండే శ్రీనివాస్ జనసేనలో చేరిన తర్వాత రూ.వందల కోట్లకు పడగెత్తారని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: