
మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం ఈ సమస్యలకు మూలకారణంగా కనిపిస్తుంది. తెలుగు భాషలో నైపుణ్యం ఉన్న మూల్యాంకనకర్తల లభ్యత, మార్కుల కేటాయింపు ప్రమాణాలపై టీజీపీఎస్సీ స్పష్టమైన సమాచారం అందించలేకపోయింది. హైకోర్టులో దాఖలైన అనేక పిటిషన్లు ఈ అంశాలను ప్రశ్నిస్తున్నాయి. న్యాయస్థానం టీజీపీఎస్సీ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టి, నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయమని ఆదేశించింది. ఈ చట్టపరమైన అడ్డంకులు సంస్థ నిర్వహణ సామర్థ్యంపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
ఈ వివాదాలు అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీర్ఘ కాలంగా కష్టపడి సిద్ధమైన యువత నిరీక్షణ, అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. టీజీపీఎస్సీ తప్పిదాలు నియామక ప్రక్రియను ఆలస్యం చేయడమే కాక, రాష్ట్రంలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలను దెబ్బతీశాయి. ఈ సమస్యలు పరీక్షా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని బలంగా సూచిస్తున్నాయి. టీజీ పీఎస్సీ నిర్వహణలో విఫలమవడం రాష్ట్ర ప్రభుత్వ విశ్వ సనీయతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు