
సిరాజ్‌కు హైదరాబాద్‌లోని బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్‌తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్‌తో సంబంధాలు నెలకొల్పాడు. గత సంవత్సరం నవంబర్ 22న సిరాజ్, సమీర్ ముంబైకి వెళ్లి 10 మందిని కలిశారు. ఈ ఏడాది జనవరి 26న సమీర్ దిల్లీలో షహబాజ్, జీషన్‌లను, జనవరి 27న సిరాజ్ మండూలిలో సల్మాన్‌ను సంప్రదించారు. సామాజిక మాధ్యమాల్లో ముస్లిములపై జరుగుతున్న అన్యాయాలపై చర్చలు జరిపిన సిరాజ్, జిహాదీ భావజాలంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు.
ఇమ్రాన్ ఆదేశాల మేరకు సిరాజ్, సమీర్ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఐఈడీలతో దాడులు చేయాలని ప్రణాళిక వేశారు. ఆన్‌లైన్ ద్వారా అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలను సిరాజ్ ఆర్డర్ చేశాడు. ఈ పదార్థాలతో టిఫిన్ బాక్స్ బాంబులను తయారు చేసి, డమ్మీ పేలుళ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కుట్ర లక్ష్యం ఎక్కువ మందిని హతమార్చడం అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనబడింది. విజయనగరం శివార్లలో మే 21, 22 తేదీల్లో ఈ పేలుళ్లను ప్రయత్నించాలని సిరాజ్ ప్రణాళిక వేశాడు. ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు గుర్తించి సమయోచితంగా భగ్నం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు