
ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులకు పరీక్ష సమయం రెండున్నర గంటలు కాగా, పీజీటీ, ప్రిన్సిపాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మూడు గంటలు నిర్ణయించారు. ఇంగ్లీష్ ప్రొఫిసియెన్సీ టెస్ట్‌కు ఒకటిన్నర గంటల సమయం కేటాయించారు. నాన్-లాంగ్వేజ్ టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ ప్రొఫిసియెన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
హాల్ టికెట్లలో ఏదైనా సమస్య ఉంటే, అభ్యర్థులు హెల్ప్ డెస్క్ నంబర్లు (6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359) ద్వారా సంప్రదించవచ్చు. అలాగే, dscgrievances@apschooledu.in అనే ఈ-మెయిల్‌కు సందేహాలను పంపి నివృత్తి చేసుకోవచ్చు. ఈ విధానం అభ్యర్థులకు సౌలభ్యం కల్పిస్తుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మెగా డీఎస్సీ 2025 ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తాయని, రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు