- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

కూటమిలో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా మంత్రులు రావచ్చు అని కూట‌మి వ‌ర్గాల‌ నుంచి కొత్త విషయం బయటకు వచ్చింది. కొందరు క్యాబినెట్ లోకి వస్తే మరి కొందరు బయటికి వెళ్ళటం ఖాయమని అంటున్నారు. క్యాబినెట్లో పాతికమందికే చోటు ఉంటుంది. అందులో జనసేనకు ఒక బెర్త్ ఇస్తే .. టిడిపి నుంచి ముగ్గురు నలుగురికి ఛాన్స్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒకరిద్దరు మంత్రుల విషయంలో చూస్తే కనుక డేంజర బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు. కీలకమైన శాఖ నిర్వహిస్తున్న వారి మీద ఆరోపణలు వస్తున్నాయని అనుకూల మీడియాలోనే వార్తలు వస్తూ ఉండడంతో తప్పిస్తారా అన్న చర్చ సాగుతోంది.


జనసేనకు ఒక మంత్రి పదవి అంటే విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేత ఒకరికి ఛాన్స్ రావచ్చు అంటున్నారు. విశాఖ నగరానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఈసారి కచ్చితంగా ఇస్తారని అంటున్నారు. అది కూడా టిడిపికే చెందిన వారికి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే విశాఖ సిటీ కంచుకోటగా ఉంది. అయితే మంత్రి లేకపోవడంతో రాజకీయంగా కొంత ఇబ్బందిగా మారిందని అంటున్నారు. విశాఖ జిల్లాలో అంతా కలిపి ఉంచడం .. రాజకీయంగా దూకుడు పెంచడం వంటివి చేయాలంటే మంత్రిని ఖచ్చితంగా విశాఖ సిటీ నుంచి ఎంపిక చేయాలని అంటున్నారు. మరి క్యాబినెట్ లోకి వచ్చేది ఎవరు ? బయటకు వెళ్లేది ఎవరు అన్నదానిపై కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ ఉండేలా లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: