
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది అతి తక్కువ పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని ఆరోపించారు. ఈ బెదిరింపులే పెట్టుబడులు దూరం చేస్తున్నాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ విషయం రాష్ట్ర పరిపాలనకు దెబ్బ తగిలిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.హరీశ్ రావు ఈ ఆరోపణలను మరింత బలపరిచారు. వ్యాపారవేత్తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరించి వసూలు చేస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పాలితంలో విస్తరిస్తోందని ఆయన విమర్శించారు.
ఇది మేం చేస్తున్న ఆరోపణలు కాదు, స్వయంగా ఒక మంత్రి కుమార్తె చెప్పిన వాస్తవమని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఘటనలు క్యాబినెట్ సమావేశాలను ప్రభావితం చేస్తున్నాయి. మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోవడంతో రాష్ట్ర పరువు దెబ్బతింటోందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. హోంశాఖ సీఎం ఏ రేవంత్ రెడ్డి వద్దే ఉంటే, నిష్పాక్షిక దర్యాప్తు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం లేదా జ్యుడిషియల్ ప్రొబ్ కోరుతూ, బీఆర్ఎస్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత ఘర్షణలను బయటపెడుతున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఇంకా స్పందించలేదు. హరీశ్ రావు మాటలు రాష్ట్రంలో రాజకీయ తుఫానును రేకెత్తిస్తున్నాయి. ఏం సాధించామని కాంగ్రెస్ విజయోత్సవాలకు సిద్ధమవుతోందని ఆయన వ్యంగ్యాస్త్రం విడుదల చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు