విజయనగరం జిల్లాలో తుఫాను ప్రభావం మొదలవుతూ తేలికపాటి వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతను నింపుతోంది. అధికార యంత్రాంగం విపత్తును ఎదుర్కోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటూ సిద్ధంగా ఉంది. ఆదివారం రాత్రి ప్రత్యేక అధికారి రవి సుభాష్ జిల్లాకు చేరుకుని చర్యలను వేగవంతం చేశారు. జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై ముందస్తు జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు.జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల సెలవులు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు.

కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా వినతుల స్వీకరణను రద్దు చేశారు. తుఫాను పర్యవేక్షణ సహాయ కార్యక్రమాల కోసం బొబ్బిలి చీపురుపల్లి విజయనగరం ఆర్డీవో కార్యాలయాల్లోను కలెక్టరేట్ లోను కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఈ రూములు రాఉండ్ ది క్లాక్ పనిచేస్తాయి.ఈ రోజు ఉదయం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఎస్పీ దామోదర్ భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతం ముక్కాలో పర్యటించారు.

తుఫాను ప్రభావం ముందస్తు చర్యల గురించి గ్రామస్తులకు మండల స్థాయి అధికారులకు అనేక సూచనలు ఇచ్చారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఆహార నిల్వలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై పనిచేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా ఆస్పత్రి సేవలు అంతరాయం లేకుండా కొనసాగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. తుఫాను బెడద నుంచి ప్రజలను కాపాడటం ప్రధాన ధ్యేయంగా నిలుస్తోంది. ఈ చర్యలు జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: