ఈ ఘటన రాజకీయ వ్యూహాలను ప్రశ్నార్థకం చేస్తోంది.కవిత ఆరోపణలు హరీశ్ రావును ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. మెదక్ జిల్లాలో 450 ఎకరాల భూములు హరీశ్ కొనుగోలు చేశారని, రెడ్డిపల్లి, చిప్పలదుర్తి గ్రామాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారని ఆరోపించారు. rrr అలైన్‌మెంట్ మార్పులో హరీశ్ పాత్ర ఉందని, ఇది పార్టీకి నష్టం కలిగించిందని చెప్పారు. హరీశ్ రేవంత్‌తో లోపాయికీ ఒప్పందం కుదుర్చుకున్నారని, బీఆర్ఎస్ ఓటమికి హరీశ్ ద్రోహం కారణమని కవిత వాదించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమి తర్వాత ఈ ఆరోపణలు మరింత ఊపొందాయి.
సంతోష్ రావు దోస్తు పోచంపల్లి శ్రీనివాస్ 750 కోట్లు వెంచర్ వేశారని కూడా కవిత పేర్కొన్నారు. ఈ విషయాలు బీఆర్ఎస్‌లో నమ్మక సంక్షోభాన్ని సృష్టించాయి. హరీశ్ బినామీలు, కంపెనీలు రేవంత్‌తో ముడిపడి ఉన్నాయని ఆరోపణలు పార్టీలో విభేదాలను తీవ్రతరం చేశాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి