ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులు సరైన చికిత్స పొందలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. బోధనాసుపత్రులు జిల్లా ఆసుపత్రులు ప్రాంతీయ ఆసుపత్రుల్లో వైద్యులు సక్రమంగా హాజరుకావడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ వైద్యులు రోజువారీగా ఎంతమంది రోగులకు ఓపీలో చికిత్స అందిస్తున్నారో స్పష్టమైన నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

విధుల్లో అలసత్వం ప్రదర్శించే వైద్యులు సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదికారులకు సూచించారు. అదే సమయంలో బాధ్యతాయుతంగా పనిచేసే వైద్యులను ప్రోత్సాహించే విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేయాలని స్పష్టం చేశారు.ఆసుపత్రుల్లో వైద్యులు లేకపోవడం వల్ల రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం అసాధ్యమని హెచ్చరించారు.

బోధనాసుపత్రుల్లో అడ్మినిస్ట్రేటర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని మంత్రి విమర్శించారు. ఈ వ్యవస్థలో వెంటనే మార్పు రావాలని ఆయన డిమాండ్ చేశారు.సమీక్ష సమావేశం అనంతరం ఉన్నతాధికారులు తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు పర్యవేక్షణ బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో బాధ్యత పెంచేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవ తీసుకున్నారు. ఈ చర్యలతో రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: