కలిసికట్టుగా ఉంటే విజయం సాధించడం చాలా తేలిక అనే విషయం బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఈ విషయాన్ని టిడిపి అధినేత రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. `అందరూ కలిసికట్టుగా ఉండండి మళ్లీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తారు` అని ఆయన అనేక సందర్భాల్లో చెబుతున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. అయినాప్పటికీ క్షేత్రస్థాయిలో చాలామంది నాయకులు దీనిని లైట్గా తీసుకుంటున్నారు.


మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. కానీ తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే గడిచిన మూడు సంవత్సరాలుగా బీహార్ లో ఎన్డీఏ పాలక పార్టీల‌ ఐక్యత గట్టిగా ఉండటంతో పాటు ప్రజలను మెప్పించే విధంగా వారు వ్యవహరించడంతో ఇప్పుడు ఊహించ‌ని విధంగా విజయాన్ని సాధించుకోవడం సాధ్యమైంది. వాస్తవానికి ప్రజలను మెప్పించటం ప్రజల దగ్గర ఓటును సంపాదించడం అనేది అంత తేలిక విషయం కాదు.


ప్రస్తుతం బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. బలమైన పోటీ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు ఉన్నారు. తద్వారా ఓటు బ్యాంకును ఏ విధంగా అయినా మేనేజ్ చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఎన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ బీహార్లో ఎన్డీఏ కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. 208 స్థానాల్లో మెజారిటీ దక్కించుకుని అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరహా విజయం రాష్ట్రంలో రావాలి అంటే లేదా గత ఎన్నికల్లో జరిగిన విధంగా 164 స్థానాల్లో తిరిగి విజయం సాధించుకోవాలి అంటే ఇప్పటి నుంచైనా మారాలి.


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? గతంలో మూడు సంవత్సరాలు బీజేపీ అదే విధంగా జెడియు అలాగే కూటమి పక్షాలు ప్రజలకు ఎలా చేరువయ్యాయి వారి సమస్యలు ఎలా తెలుసుకున్నాయి... అనే విషయంపై ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు దృష్టి పెట్టాలి. ఎవరికి వారు మాకెందుకులే అధినేతలు చూసుకుంటారు.. అని గనక ఆలోచిస్తే బీహార్ లో ఎలాగైతే ప్రతిపక్షం దారుణమైన దెబ్బను అనుభవిస్తుందో ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి కలిసికట్టుగా ఉంటేనే విజయం పట్టుకోవడం సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పిన వాస్తవాలు నాయకులు తెలుసుకోవాలి.


క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి విభేదాలను తగ్గించుకోవాలి. ప్రజలకు చేరువ కావాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో ఆశించిన విజయాన్ని దక్కించుకోవడం అనేది సాధ్య సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే నాయకులు పార్టీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు గనక కలిసికట్టుగా లేకపోతే భవిష్యత్తులో ఏదైనా తేడా జరిగితే నష్టపోయేది కార్యకర్తలు ద్వితీయశ్రేణి నాయకులు మాత్రమే అన్న విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: