ప్రతి సీజన్ ముందు మద్దతు ధర ప్రకటించి గొప్పలు చెప్పుకుంటారని, కానీ రైతు పండించిన పంటకు నిజంగా ఆ ధర లభిస్తుందని ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో పండే పంటల సంఖ్య, కేంద్రం కొనుగోలు చేసే పంటల సంఖ్య మధ్య భారీ తేడా ఉందని ఎత్తి చూపారు. మొత్తం ఉత్పత్తిలో కేంద్రం కొనే భాగం స్వల్పమేనని, మిగతా పంటలకు రకరకాల ఆంక్షలు పెట్టి రైతును రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు.దళారుల చేతుల్లో రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేపడుతోందని తుమ్మల స్పష్టం చేశారు.
నాఫెడ్ ద్వారా సోయాబీన్ కొనుగోళ్లలో ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేసి కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఓటీపీ సౌకర్యం తీసుకొచ్చి కౌలు రైతులను కాపాడుతోందని గుర్తు చేశారు.కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను బట్టి తెలంగాణ రైతులు ఎప్పటిదాకా అన్యాయం భరిస్తారని తుమ్మల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించి సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను ఓ ప్రకటనలో వెల్లడించిన మంత్రి రైతు హక్కుల కోసం పోరాడే స్ఫూర్తిని ప్రదర్శించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి