ఇదిలా ఉంటే, 2019లో విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మళ్లీ పశ్చిమ నియోజకవర్గంలో తన బలాన్ని ప్రదర్శించేందుకు ముందుకొస్తున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ నుంచి ఓడిపోయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ కూడా చేదు ఫలితం ఎదురైంది. ఈ నేపథ్యంలో తిరిగి తన అసలు బలమైన పశ్చిమ నియోజకవర్గంలోనే తన బలప్రదర్శన మొదలుపెట్టారు. తిరిగి టికెట్ పొందడమే లక్ష్యంగా క్రమంగా కార్యకర్తలతో మమేకమవుతూ ఆయన తన ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మరోవైపు, ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ కూడా ఇదే టికెట్‌పై కళ్లుపెట్టారు. జనసేన తరఫున పశ్చిమ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ బయటకు వచ్చిన ఆయన, ఇప్పుడు వైసీపీలో తన రాజకీయ భవిష్యత్తు కోసం పశ్చిమ నియోజకవర్గాన్నే కేంద్రంగా ఎంచుకున్నారు. తరచూ పార్టీ పెద్దల ముందు టికెట్ విషయాన్ని ప్రస్తావిస్తూ, వచ్చే ఎన్నికల్లో తానే సరైన అభ్యర్థినని మహేష్ ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇలా ముగ్గురు నేతలు ఒకే నియోజకవర్గం కోసం పోరాటం సాగిస్తూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో విభేదాలు మరింత పెరుగుతున్నాయి. ఓటు బ్యాంకును కుదుర్చుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో ఇలాంటి అంతర్గత పోరు వైసీపీకి నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా సమసిపెట్టుతుంది? ఎవరికీ టికెట్ ఇస్తుంది? నియోజకవర్గంలో పార్టీ పుంజుకునేలా ఏ వ్యూహం సిద్ధం చేస్తుంది? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి